Mokshajna : మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ .. జూనియర్ ఎన్టీఆర్ కు నందమూరి ఫ్యాన్స్ టర్న్ అవుతారా?
Mokshajna : బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ త్వరలోనే సినిమాల్లో అరంగ్రేటం చేయనున్నాడు. సీనియర్ ఎన్టీఆర్ వారసుడిగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయమై తానెంటో నిరూపించుకున్నాడు నటుడు బాలకృష్ణ. చెన్నై నుంచి హైదరాబాద్ కు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వచ్చిన సమయంలో కొంచెం కష్ట కాలంలో ఉండేది. ఆ సమయంలో ఎన్టీఆర్ లాంటి సీనియర్ నటులు ఇండస్ట్రీని భుజాలపై మోశారు.
అయితే మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తే జూనియర్ ఎన్టీఆర్ కు పోటీ ఇచ్చే అవకాశం ఉందని బాలయ్య అభిమానులు అనుకుంటున్నారు. బాలయ్య తర్వాత నందమూరి వంశంలో హిరోలుగా నలుగురు నుంచి అయిదుగురు వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ ఒక్కటే సక్సెస్ అయ్యాడు. జూనియర్ ఎన్టీఆర్ తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 25 సంవత్సరాలు అవుతోంది.
జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి, పూరీ జగన్నాథ్ లాంటి టాప్ డైరెక్టర్ లతో సినిమాలు తీసి మంచి హిట్లు అందుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఆస్కార్ స్థాయికి చేరుకున్నారు. ఇంతటి గొప్ప విజయాలు అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ కు బాలయ్య కొడుకుతో పోటీ ఉంటుందా.. ఉండదా అనే చర్చ సాగుతోంది. బాలయ్య కొడుకు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వగానే నందమూరి వంశస్తులు మొత్తం మోక్షజ్ఞ కు ఫ్యాన్స్ గా షిప్టు అయిపోతారని అనుకుంటున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం అదేం లేదని బాలయ్య కొడుకును ఆదరిస్తూనే ఎన్టీఆర్ పై ఉన్న అభిమానం పోదాని అంటున్నారు. కాగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో జోక్యం చేసుకోకుండా చంద్రబాబు అరెస్టు అయిన సమయంలో మౌనంగా ఉండిపోయాడు. కాగా ఆ మౌనమే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ను తెలుగు దేశం కార్యకర్తలు దూరం చేసుకునేలా అయింది. టీడీపీ అధికారంలోకి రాగానే జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు కు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. కానీ చంద్రబాబు నాయుడుని ఇప్పటి వరకు కలవలేదు. కాగా బాలయ్య కూడా జూనియర్ ఎన్టీఆర్ పేరెత్తితే ఒంటి కాలిమీద లేస్తున్నాడు. ఇద్దరికీ మాటలు లేవని ఇండస్ట్రీ వర్గాల టాక్. మరి ఈ బాలయ్య కొడుకు సినిమాల్లో ఎంట్రీతో ఎన్టీఆర్ కు నష్టం కలగనుందా అనే చర్చ జరుగుతోంది.