Mohan Babu : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నెంబర్ 1 కమర్షియల్ హీరో గా ఒక వెలుగు వెలుగుతూ కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి, ఇప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని నెలకొల్పుతూ నేటి తరం స్టార్ హీరోలతో పోటీ పడుతున్నాడు. కేవలం సినిమాల పరంగా మాత్రమే కాకుండా, సేవ కార్యక్రమాల విషయాల్లో కూడా చిరంజీవి ఎప్పుడు ముందు ఉంటాడు.
ఒక విధంగా చెప్పాలంటే, సామజిక సేవ అంటే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు చిరంజీవి మాత్రమే. సమస్య ఎక్కడ ఉంటే అక్కడ పరిష్కారం రూపం లో మెగాస్టార్ చిరంజీవి ఉంటాడు. రక్త దానాలు , నేత్ర దానాలు, ఆక్సిజన్ బ్యాంక్స్ ఇలా ఒక్కటా రెండా, ఎన్నో వందల కుటుంబాలకు ఆయన సహాయం చేసి ఉంటాడు. అందుకే కేంద్ర ప్రభుత్వం నేడు ‘పద్మ విభూషణ్’ పురస్కారం తో సత్కరించింది. ఈ విషయం తెలిసిన తర్వాత ప్రముఖ నటీనటులందరూ మెగాస్టార్ చిరంజీవి కి శుభాకాంక్షలు తెలియచేసాడు.
అవార్డుల విషయం లో అందరూ శుభాకాంక్షలు తెలియచేయడం వేరు, మోహన్ బాబు శుభాకాంక్షలు తెలియ చెయ్యడం వేరు . గతం లో చిరంజీవి వజ్రోత్సవ వేడుకల్లో అవార్డు ఇచ్చినప్పుడు మోహన్ బాబు చేసిన రచ్చ గురించి అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. దీనిపై అప్పట్లో పెద్ద రచ్చ జరిగింది. చిరంజీవి కంటే తాను గొప్ప నటుడిని అని, విద్యానికేతన్ విద్యాసంస్థల ద్వారా ఎంతో మంది చిన్న పిల్లలకు ఉచితంగా చదువు చెప్పించానని, అలాంటి నాకు ఇవ్వకుండా, చిరంజీవి కి ఇవ్వడం ఏమిటి అని బహిరంగంగా స్టేజి మీదనే తన నిరసన వ్యక్తం చేసాడు. ఆ తర్వాత చిరంజీవి కి పద్మభూషణ్ అవార్డు వచ్చినప్పుడు కూడా తనకి రాలేదని బాధపడ్డాడు.
ఇప్పుడు పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది, దీనికి ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో అని అందరూ ఎదురు చూసారు. కానీ నేడు ఆయన ట్విట్టర్ లో ‘నా చిరకాల మిత్రుడు చిరంజీవి కి పద్మవిభూషణ్ రావడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. ఈ అవార్డు అందుకోవడానికి ఆయన అన్ని విధాలుగా అర్హుడు, ఈ సందర్భంగా కృతఙ్ఞతలు తెలియచేస్తున్నాను’ అంటూ వేసిన ఒక పోస్ట్ తెగ వైరల్ గా మారింది. మోహన్ బాబు నుండి ఇలాంటి పోస్టు రావడమా, అబ్బో అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.