JAISW News Telugu

Chiranjeevi – Mohan Babu : చిరు హిట్టైన సినిమాను మోహన్ బాబు చేయాల్సింది.. కొద్దిలో చాన్స్ మిస్సయ్యాడుగా..

Chiranjeevi - Mohan Babu

Chiranjeevi – Mohan Babu

Chiranjeevi – Mohan Babu : చిరంజీవి, మోహన్ బాబు మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉందనే విషయం అందరికి తెలిసిందే. చిరు, మోహన్ బాబు తెలుగు సిని ఇండస్ట్రీలో పెద్ద హిరోలుగా ఖ్యాతి గడించారు. వీరిద్దరి మధ్య వజ్రోత్సవ వేడుకల్లో బహిరంగంగానే విమర్శలు చేసుకున్నారు. లెజెండ్ అంటే ఎవరూ? సెలబ్రేటీ అంటే ఎవరూ అనే వివాదం నెలకొని వజ్రోత్సవ సంబరాలు కాస్త వివాదం గా మారిన విషయం తెలుగు సినీ ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోరు.

మోహన్ బాబు, చిరంజీవి టాప్ హిరోలుగా తెలుగు లో గుర్తింపు పొందగా.. వీరిద్దరూ ఒకరు చేయాల్సిన మూవీని మరొకరు చేశారనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 1997 లో చిరంజీవి ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో హిట్లర్ సినిమా చేశాడు. ఇది బంపర్ హిట్ అయింది. 100 రోజులు దాదాపు 42 థియేటర్లలో ఆడింది. చిరంజీవికి జోడిగా రంభ నటించగా.. రాజేంద్రప్రసాద్ కీలక రోల్ పోషించాడు. చిరంజీవి నలుగురు చెల్లెళ్లకు అన్నగా సీరియస్ క్యారెక్టర్ నటించడంతో తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ అందరికీ అన్న అయిపోయాడు.

అయితే ఇదే మూవీని ముందుగా చిరంజీవి కాకుండా మోహన్ బాబుకు ఆఫర్ వచ్చిందటా.. కానీ దీన్ని మోహన్ బాబు తిరస్కరించాడని టాక్. అయితే హిట్లర్ మూవీ డైరెక్టు మూవీ కాకుండా అప్పటికే మలయాళంలో హిట్ అయిన ఓ మూవీకి రీమేక్ గా ఈ సినిమా తీస్తామని చెప్పడంతో మోహన్ బాబు సున్నితంగా తిరస్కరించడంటా.. తెలుగులో లేదా ఏదైనా కొత్త కథ వస్తేనే చేస్తానని.. రీమేక్ సినిమాలు చేయనని అన్నాడట.

హిట్లర్ సినిమాకు మాటలను అందించి నటుడు ఎల్ బి. శ్రీరాం కావడం విశేషం. అన్నా చెల్లెళ్ల మధ్య అనుబంధం ఏ విధంగా ఉండాలో చూపించిన ఘనత ముత్యాల సుబ్బయ్యకు దక్కితే.. అందులో మెగాస్టార్ నటనకు తెలుగు ప్రేక్షకులు నీరాజనం పలికారు. సుధాకర్ చేసిన కామెడీ, రాజేంద్ర ప్రసాద్ అల్లరి, రంభ చలాకీ తనం, మెగాస్టార్ ఆవేశం.. అన్నింటకంటే అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ కలగలిసి హిట్లర్ మూవీ భారీ హిట్ అందుకుని చిరంజీవికి మరో కిరీటం తెచ్చి పెట్టింది.

Exit mobile version