JAISW News Telugu

Mohammad Shami : మహమ్మద్ షమీ కి మళ్ళీ గాయం… ఆస్ట్రేలియా తో సిరీస్ కు అనుమానమే

Mohammad Shami

Mohammad Shami

Mohammad Shami : నవంబర్ లో ఆస్ట్రేలియాలో ఆ జట్టుతో ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ భారత్ ఆడనుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీగా పిలుచుకునే ఈ సిరీస్లో గత రెండు పర్యాయాలు ఆస్ట్రేలియా ను భారత్ ముప్పతిప్పలు పెట్టింది. గత సిరీస్ లో రిషబ్ పంత్ రాణించడంతో బోర్డర్ గవాస్కర్ ట్రోపీని కైవసం చేసుకుంది. అంతకుముందు సిరీస్ లో డ్రా చేసి అద్భుతం చేసింది.

ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై ఇంతలా ఆధిపత్యం కనబరిచినా టెస్ట్ టీం మరొకటి లేదంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా యషేష్ సిరీస్ ఆడుతుంటాయి. కానీ దానికంటే మెరుగ్గా భారత్ తో జరిగే టెస్ట్ సిరీస్ పై ప్రస్తుతం అందరి కన్ను పడింది.

భారత్ ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ మ్యాచ్ జరుగుతుందంటే ప్రస్తుతం ఎక్కడ చూసినా తీవ్ర ఉత్కంఠ నెలకొంటుంది. దీనికి కారణం ఇప్పటికే మాటల యుద్ధం మొదలైంది. ఈ సారి ఎలాగైనా భారత్ పై సిరీస్ గెలుస్తామని ఆ టీం కెప్టెన్ ప్రకటించారు. టీమిండియాలో కీలక ఆటగాడు విరాట్ కోహ్లీ కాదని తమ సిరీస్ లో దృష్టంతా రిషబ్ పంత్ పైనే అని తెలిపాడు.

రిషబ్ పంత్ ఎలాంటి మ్యాచ్ అయినా చేతి నుంచి లాగేసుకునేంత శక్తి ఉందని ఆయన అన్నాడు. రిషబ్ పంత్ గేమ్ చేంజర్ అని చెప్పాడు . రిషబ్ పంత్ ని కట్టడి చేస్తే మ్యాచ్ ఈజీగా గెలవచ్చని అన్నారు దీని కోసం తమ వద్ద ప్రత్యేకమైన ప్రణాళికలు రెడీ చేసి పెట్టుకున్నట్లు ఫ్యాట్  కమిన్స్ పేర్కొన్నాడు.

కాగా ఈ టెస్ట్ సిరీస్ కు మహమ్మద్ షమీ అందుబాటులో ఉండే అవకాశం కనిపించడం లేదు. ఇప్పటికే మోకాలికి సర్జరీ చేయించుకుని బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ లో శిక్షణ  పొందుతున్న షమీ కి తిరిగే మళ్ళీ గాయం అయినట్లు తెలుస్తోంది. మోకాలిలో కాస్త వాపు వచ్చినట్లు ఇంకా అది తగ్గాలంటే ఆరు నుంచి పది వారాలు బట్టి అవకాశం ఉందని బిసిసిఐ అధికారులు తెలిపారు.

Exit mobile version