JAISW News Telugu

Mogilirekulu Actor : ‘మొగిలిరేకులు’ నటుడు మృతి.. ఇంద్రనీల్ భార్య ఎమోషనల్ పోస్ట్..!

Mogilirekulu Actor

Mogilirekulu Actor Pavitranath

Mogilirekulu actor Passed Away : మొగిలిరేకులు సీరియల్ బుల్లితెరపై ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సీరియల్ ఎంతో మంది నటీనటులకు లైఫ్ ఇచ్చింది అని చెప్పవచ్చు. ఈ సీరియల్ లో దయా అనే పాత్ర ద్వారా మంచి పేరు తెచ్చుకున్న నటుడు పవిత్రనాథ్ నేడు అకాల మరణం చెందారు. ఈ విషయాన్ని నటుడు ఇంద్రనీల్ భార్య మేఘన తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపారు. అతడిని గుర్తుచేసుకుంటూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

‘‘ఈ బాధను మేం వర్ణించలేకపోతున్నాం.. మా జీవితంలో మాకు నువ్వు చాలా ముఖ్యమైనవాడివి. ఈ వార్త విన్న తర్వాత మేము ఇది నిజం కాకూడదని కోరుకున్నాం. ఇది అబద్ధం అయితే బాగుండని అనుకున్నాం. కానీ నువ్వు నిజంగానే ఈ లోకాన్ని వదలివెళ్లావనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం.. కనీసం నీ చివరి చూపు కూడా చూడలేకపోయాం. గుడ్ బై కూడా చెప్పలేకపోయాం. ఇనపై నిన్ను చాలా మిస్ అవుతాం. నీ ఆత్మకు శాంతి చేకూరాలి. నీ కుటుంబానికి దేవుడు మరింత శక్తిని ఇవ్వాలి’’ అంటూ ఎంతో ఎమోషనల్ అయ్యారు.

మంజుల నాయుడు తెరకెక్కించిన మొగలిరేకులు, చక్రవాకం బుల్లితెరపై ఎన్నో సంచలనాలు సృష్టించాయి. ముఖ్యంగా మొగిలిరేకులు సీరియల్ లో ధర్మ, సత్య, దయ, శాంతి, కీర్తన పాత్రలకు ప్రత్యేకంగా అభిమానులు ఉండేవారు. ముగ్గురు అన్నదమ్ముళ్లుగా కనిపించిన వీరిలో అఖరివాడు దయ. ఎంతో అల్లరిగా, అమాయకంగా కనిపించే పాత్ర తనది. ఆ సీరియల్ ద్వారా ఎంతో పేరు తెచ్చుకున్న ఈ నటుడు చాలా కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు.

అయితే ఆమధ్య పవిత్ర నాథ్ భార్య ఆయన గురించి కొన్ని సెన్సేషనల్ ఆరోపణలు చేసింది. అతడికి అమ్మాయిల పిచ్చి ఉందని.. తన ముందే తన ఇంటికి చాలా మంది అమ్మాయిలను తీసుకొచ్చేవాడని.. ఇదేంటని ప్రశ్నిస్తే తనను కొట్టేవాడని చెప్పింది. అప్పట్లో ఈ వార్తలు ఇండస్ట్రీలో చర్చనీయాంశమయ్యాయి. అయితే పవిత్రనాథ్ ఆకస్మికంగా చనిపోవడం పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు ఏం జరిగింది? ఎలా చనిపోయాడు? ఎప్పుడు జరిగింది? నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version