Trump : ప్రపంచంలో మోడీ స్థానం వేరు.. గెలుపు తర్వాత ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. కారణం అదేనా..?
Trump and Modi : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ భారీ మెజారిటీతో విజయం సొంతం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆయనకు భారత ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఫలితాలు వచ్చిన వెంటనే ఫోన్ చేసి మరీ విష్ చేశారు. ప్రపంచ శాంతి కోసం ఇరువురం కలిసి పని చేద్దామని ట్రంప్, మోడీ మాట్లాడుకున్నారు. ప్రస్తుతం ప్రపంచం నరేంద్ర మోడీని ప్రేమిస్తోందని ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. భారత్ అద్భుతమైన దేశమంటూ కితాబిచ్చారు. భారత ప్రధాని మోడీ తనకు అత్యంత ఆత్మీయ స్నేహితుడని ఆయన చెప్పుకచ్చారు.
ఇదిలా ఉండగా.. లెక్కింపు మొత్తం పూర్తయిన తర్వాత ట్రంప్ విజయం ఖాయమైంది. అయితే ఫలితాలు రిలీజ్ చేసేందుకు రెండు, మూడు రోజుల సమయం పడుతుంది. కమలా హ్యారీస్ చాలా వరకు నెట్టుకచ్చారు. గెలుపుకోసం ఆమె నిరంతరం పోరాటం చేశారు. ఒక దశలో ఆమె గెలుపు దాదాపు ఖాయమని అంతా అనుకున్నారు. కానీ అమెరికన్లు మరోలా తీర్పు ఇచ్చారు. హోరాహోరీగా జరిగిన ఈ పోరులో ఏకపక్ష విజయం సాధించిన ట్రంప్ వివిధ దేశాల అంచనాలను తలకిందులు చేశారు. గెలుపోటములను నిర్ణయించే స్వింగ్ స్టేట్స్‌ను ట్రంప్ క్లీన్ స్వీప్ చేశారు.