JAISW News Telugu

Modi 3.0 : నేడు మోడీ తొలి కేబినెట్ భేటీ.. మంత్రులకు శాఖల కేటాయింపు ?  

Modi 3.0

Modi 3.0

Modi 3.0 :  నరేంద్ర మోడీ ముచ్చటగా మూడో సారి ప్రధానిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 30మందికి పైగా కేంద్ర మంత్రులు ప్రమాణం చేశారు. నేడు తొలి సారి కేంద్ర క్యాబినెట్ భేటి కానుంది. ఎవరెవరికి ఏ శాఖ ఇస్తారనే దానిపై నేడు జరిగే క్యాబినెట్ భేటీలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మంత్రులకు శాఖల కేటాయింపులో కూడా మోడీ మార్క్ కనపడనున్నట్లు సమాచారం. సోమవారం సాయంత్రం మోడీ నేతృత్వంలో కొత్త కేంద్ర మంత్రి వర్గం భేటీ కానుంది. మిత్రపక్షాలు ఆశిస్తున్న శాఖల అంశాన్ని పరిగణలోకి తీసుకున్న బీజేపీ.. తన వ్యూహాత్మక నిర్ణయంతోనే ముందుకు సాగనున్నట్లు తెలుస్తోంది.  కీలకమైన ఆర్థిక, హోం, రక్షణ, విదేశాంగ, రైల్వే, రవాణా శాఖలను బీజేపీ తమ దగ్గరే ఉంచుకోనుంది. అలాగే.. మూడో దఫా ప్రభుత్వంలో ఉత్పత్తి రంగం, మౌలిక వసతులపై ప్రధానంగా ఫోకస్ చేయనున్నట్లు మోడీ ప్రకటించారు. దీని పరిధిలోకి వచ్చే శాఖలు కూడా బీజేపీ చేతిలోనే ఉంచుకునే అవకాశం కనిపిస్తోంది.  మంత్రి వర్గ కూర్పులో ప్రధాని మోడీ కులసమీకరణాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు సమాచారం. దీంతో పాటు త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకూ తగిన ప్రాధాన్యం ఇచ్చారు. ఇక కొత్త మంత్రుల్లో 27 మంది బీసీలు ఉన్నారు. ఐదుగురు మైనార్టీలు, ఏడుగురు మహిళలు ఉన్నారు. యువత, సీనియర్ల కాంబినేషన్‌లో మోడీ మార్క్‌తో మంత్రులకు పోర్టుఫోలియోలు ఉంటాయనేది తెలుస్తోంది.

ఇక.. ఎన్డీయే మిత్రపక్ష పార్టీలు సైతం తమ తమ ప్రయోజనాల దృష్ట్యా శాఖలను డిమాండ్‌ చేశాయి. జేడీఎస్‌ కుమారస్వామి వ్యవసాయ శాఖ కోరినట్లు సమాచారం. మరోవైపు రాష్ట్ర ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకునే పలు శాఖలను కోరామని మరో మిత్రపక్షం టీడీపీ ఇది వరకే ప్రకటించుకుంది. అలాగే.. జేడీయూ, ఇతర పార్టీలు సైతం పలు శాఖలను డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్డీయే ఎంపీల సమావేశం జరుగుతున్న సమయంలోనే బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో మిత్రపక్ష నేతలతో మంత్రివర్గ కూర్పు, ఎవరికి ఏయే శాఖల కేటాయించాలి అన్న అంశాలపై చర్చలు జరిపి ఓ నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. నిన్న రాత్రి 72 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో 30 మంది మంత్రివర్గంలోకి, ఐదుగురికి స్వతంత్ర మంత్రులుగా, అలాగే.. 36 మంది సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 43 మంది మూడుకంటే ఎక్కువ సార్లు పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. అలాగే.. ఆరుగురు మాజీ సీఎంలను తీసుకోవడం గమనార్హం. అలాగే.. తెలుగు రాష్ట్రాల తరఫున తెలంగాణ నుంచి ఇద్దరు, ఏపీ నుంచి ముగ్గురు మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. విశేషం ఏంటంటే.. కేంద్ర కేబినెట్‌లో ఇంకా ఖాళీగానే తొమ్మిది బెర్తులు ఉన్నాయి.

Exit mobile version