Modi Diwali celebrations : ప్రధాని నరేంద్ర మోదీ గురువారం గుజరాత్‌లోని కచ్‌లో సైనికులతో కలిసి దీపావళి జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీఎస్ఎఫ్ జవాన్లకు ప్రధాని తన చేతులతో మిఠాయిలు తినిపించారు. దీంతో పాటు సర్ క్రీక్ ప్రాంతాన్ని మోదీ పరిశీలించారు. బీఎస్ఎఫ్ జవాన్లపై ప్రధాని ప్రశంసల వర్షం కురిపించారు. ప్రతీ దీపావళికి ఆయన సైనికలతో కలిసి వేడుకలు చేసుకుంటారు.
గతేడాది హిమాచల్ ప్రదేశ్‌లోని లెప్చాలో సైనికులతో కలిసి దీపావళి జరుపుకున్నారు. అదే సమయంలో, 2022లో, ప్రధాని మోదీ కార్గిల్‌లో సైనికులతో కలిసి దీపావళి జరుపుకున్నారు. 1999 కార్గిల్ యుద్ధంలో అమరులైన జవాన్లకు నివాళులర్పించారు. ప్రధాని మోదీ ఈ ఏడాది వరుసగా 11వ సారి దీపావళిని సైనికులతో జరుపుకున్నారు.
ప్రధాని మోదీ ఇప్పటి వరకు ఎక్కడ దీపావళి జరుపుకున్నారు?
2014: ప్రధాని మోదీ సియాచిన్‌లో సైనికులతో కలిసి దీపావళి జరుపుకున్నారు.
2015: పాకిస్తాన్ సరిహద్దు (పంజాబ్ సరిహద్దు)లో సైనికులతో కలిసి దీపావళిని జరుపుకున్నారు.
2016: హిమాచల్ ప్రదేశ్‌లో సైనికులతో కలిసి దీపావళిని జరుపుకున్నారు.
2017: జమ్ము-కశ్మీర్ లోని బందిపొరాలో సైనికులతో కలిసి దీపావళిని జరుపుకున్నారు.
2018: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో ITBPతో దీపావళిని జరుపుకున్నారు.
2019: జమ్ము-కశ్మీర్ రాజౌరీలో సైనికులతో కలిసి దీపావళిని జరుపుకున్నారు.
2020లో రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో సైనికులతో కలిసి దీపావళి జరుపుకున్నారు.
2021: జమ్ము-కశ్మీర్‌లోని నౌషేరా సెక్టార్‌లో సైనికులతో కలిసి దీపావళి జరుపుకున్నారు.
2022: కార్గిల్‌లో సైనికులతో కలిసి దీపావళి జరుపుకున్నారు.
2023: హిమాచల్ ప్రదేశ్‌లోని లెప్చాలో సైనికులతో కలిసి దీపావళి జరుపుకున్నారు.
కేవడియాలో సర్దార్ పటేల్‌కు నివాళి..
కచ్ చేరుకోవడానికి ముందు, ప్రధాని కెవాడియాకు వెళ్లారు. అక్కడ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి, ఐక్యతా దినోత్సవ పరేడ్‌లో పాల్గొన్నారు. కేవడియాలో ప్రధాని మోదీ మాట్లాడుతూ దేశ ఐక్యత గురించి కొందరు ఆందోళన చెందుతున్నారన్నారు. అలాంటి వారి పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి. భారత్ పెరుగుతున్న శక్తిపై కొన్ని శక్తులు ఆందోళన చెందుతున్నాయని ఆయన అన్నారు. అలాంటి వ్యక్తులు దేశంలో అస్థిరత, అరాచకాలను వ్యాప్తి చేస్తారని అన్నారు. ఈ రోజు మన ముందు భారత్ ఉందని, దానికి విజన్, డైరెక్షన్ రెండూ ఉన్నాయని ప్రధాని మోదీ అన్నారు.
#WATCH प्रधानमंत्री नरेन्द्र मोदी ने गुजरात के कच्छ में सर क्रीक क्षेत्र के लक्की नाला में बीएसएफ, सेना, नौसेना और वायु सेना के जवानों के साथ दिवाली मनाई। pic.twitter.com/U0iiTqZpDm
— ANI_HindiNews (@AHindinews) October 31, 2024