Modi : 70 ఏళ్లు దాటిన వారికి మోడీ బంపర్ ఆఫర్.. ఆ కార్డు ఉంటే సరి..
Modi : మోడీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి సంక్షేమాన్ని పరుగులు పెట్టించారు. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు చాలా రకాల సంక్షేమ పథకాలు తీసుకువచ్చారు. ప్రతీ దశలో ఏదో ఒక విధంగా మేలు జరిగేలా పథకాలను రూపొందించారు. ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి సుకన్య సమృద్ధి యోజన నుంచి మధ్య వయస్సుకు, చివరికి వృద్ధాప్యం చేరే వరకు కూడా మంచి మంచి పథకాలు ఉన్నాయి. కొన్నింటిని పోస్టాఫీస్ నుంచి కొనసాగిస్తున్నారు.
మోడీ ప్రధాన మంత్రి అయిన తర్వాత అప్పుడప్పుడు ప్రజలతో నేరుగా రేడియో ద్వారా, లేదంటే టీవీ ద్వారా మాట్లాడుతున్నారు. దేశంలో గొప్ప అంశాలు, గొప్పగా జరిగిన విషయాలు, గొప్ప గొప్ప వ్యక్తులు, క్రీడా, విద్యా రంగాల్లో నైపుణ్యం ఉన్న వారి గురించి చెప్తూనే ఉన్నారు. వీటితో పాటు ప్రకృతి వైపరీత్యాలు, అవి జరగకుండా మానవుడు చేసే పనుల గురించి కూడా ఆయన వివరిస్తారు.
మోడీ పాలనలోనే వచ్చిన మరో అద్భుత సంక్షేమ పథకం ‘ఆయుష్మాన్ భారత్’. ఈ పథకంలో 70 ఏళ్లు దాటిన వారికి రూ. 5 లక్షల ఆరోగ్య బీమా కలిగిస్తున్నట్లు చెప్పారు. 9వ ఆయుర్వేద దినోత్సవం, ధన్వంతరి జయంతిని పురస్కరించుకొని ‘ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన’ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకంలో ఆదాయంతో సంబంధం లేకుండా 70 దాటిన వారికి ఆరోగ్య బీమా కవరేజి లభిస్తుందన్నారు. అందుకే 70 సంవత్సరాలు దాటిన వారు ఖచ్చితంగా ఆయుష్మాన్ కార్డు తీసుకోవాలని ప్రధాని సూచించారు.