Jagannath Temple in Dubai : దుబాయ్ లో ఆధ్యాత్మిక సంబురం.. జగన్నాథుడి ఆలయంలో మోదీ పూజలు
Jagannath Temple in Dubai : ప్రధాని మోదీ పట్టుదల అందరికీ తెలిసిందే. దేశ ప్రయోజనాల రిత్యా ఏది అవసరమో.. దాన్ని సాధించుకుంటూ ముందుకెళ్తున్నారు. దేశంలోని మెజార్టీ హిందువుల దశాబ్దాల కల అయిన అయోధ్యలో శ్రీరామమందిర నిర్మాణం చేపట్టడమే ఆయన పట్టుదలకు నిదర్శనం. ఇక దేశంలో పెండింగ్ లో ఉన్నా.. బీజేపీ మ్యానిఫెస్టోలో చెప్పిన అన్ని అంశాలను ఒకదాని తర్వాత ఒకటి చేపడుతూ విజయవంతమవుతున్నారు. అలాగే ప్రపంచ యవనికపై హిందూ మత గొప్పతనాన్ని చాటుతున్నారు.
తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అబుదాబిలో అతిపెద్ద హిందూ దేవాలయాన్ని ప్రధాని ఫిబ్రవరి 14న ప్రారంభించారు. బోచసన్యాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ(బీఏపీఎస్) ఆధ్యాత్మిక గురువు మహంత్ స్వామి మహారాజ్ తో ప్రారంభత్సోవం చేశారు. అనంతరం బీఏపీఎస్ ఆలయాల్లో జరిగిన గ్లోబల్ హారతిలో పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరి కోసం ఆలయాన్ని నిర్మించాం.. దేవుడి దయ, అందరి సహకారం, అబుదాబి పాలకుల ఔదార్యం, సాధువుల ఆశీర్వాదం, ప్రధాని మోదీ సహకారంతో నిర్మాణం చేపట్టామంటూ.. ఆలయ ప్రారంభోత్సవం అందరికీ ఓ వేడుకలాంటిది’’ అని బీఏపీఎస్ స్వామి నారాయణ్ మందిర్ సాధువు బ్రహ్మ విహారీ దాస్ తెలిపారు.
కాగా, మోదీ అనంతరం దుబాబ్ లోని లార్డ్ జగన్నాథ్ ఆలయాన్ని సందర్శించారు. ఆయనకు పూరి రాజు గజపతి మహరాజ్ శ్రీ దివ్యసింగ్ దేవ్ స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని జగన్నాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ పరిసరాలు కలియదిరిగారు. ఈ సందర్భంగా మహరాజ్ శ్రీ దివ్యసింగ్ దేవ్, పూజారులు, సాధువులతో ప్రధాని మోదీ కాసేపు ముచ్చటించారు.