అయోధ్యలోని దివ్య, భవ్య రామ మందిరంలో రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠను శ్రీరాముడు ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా చేయించుకున్నాడు. 500 సంవత్సరాల కల నేడు (జనవరి 22, 2024) నెరవేరింది. ఈ వేడుకను చూసేందుకు దేశంలోని సాధు సంతులతో పాటు వివిధ రంగాల్లోని ప్రముఖులు అయోధ్యపురికి చేరుకున్నారు. రామ్ లల్లాను దర్శించుకొని తరించారు. రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ ఈ రోజు శ్రీ రాముడికి క్షమాపణలు చెప్పుకున్నాను అన్నారు.
శ్రీ రాముడికి క్షమాపణలు చెబుతున్నానని మోదీ పేర్కొన్నారు. ఇన్ని శతాబ్దాలుగా ఈ పని చేయలేకపోయిన మన ప్రయత్నం, త్యాగం, పట్టుదలలో ఏదో లోపం ఉందన్నారు. ఈ రోజు ఆ పని పూర్తయింది. శ్రీ రాముడు ఈ రోజు మమ్మల్ని తప్పకుండా క్షమిస్తాడని నేను నమ్ముతున్నాను అన్నారు.
అయోధ్యలో రామ మందిర నిర్మాణం శాశ్వత, సవాలుతో కూడుకున్న ప్రక్రియ అని మోదీ వ్యాఖ్యానించారు. రాముడు భారతదేశ విశ్వాసం, రాముడు భారతదేశానికి పునాది అని ఆయన తన ప్రసంగంతో సభికులనుద్దేశించి వివరించాడు. రాముడు భారతదేశం యొక్క ఆలోచన, రాముడు భారతదేశ చట్టం. రాముడు భారతదేశానికి ప్రతిష్ఠ, రాముడు భారతదేశానికి మహిమ అని ఆయన చెప్పారు.
ఈ వైభవ వేడుకలతో శ్రీరాముడు జన్మ స్థలంలో ఉండాలన్న 500 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. ఈ నెల 23వ తేదీ నుంచి ఆన్ లైన్, ఆఫ్ లైన్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రతీ ఒక్కరూ రామ్ లల్లాను దర్శించుకునేందుకు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏర్పాట్లు చేసింది.