Modi : అమరావతిలో మళ్లీ శంకుస్థాపన కు మోదీ

Modi
Modi : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల 15 నుంచి 20వ తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రాజధాని అమరావతిలో నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభించేందుకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని పర్యటన ఖరారైనప్పటికీ, అధికారిక తేదీ ఇంకా నిర్ణయించబడలేదు. అయితే, ప్రభుత్వం మాత్రం వెలగపూడి సచివాలయం వెనుక 250 ఎకరాల్లో బహిరంగ సభ ఏర్పాటుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ స్థలంలోనే ఈ నెల 30న ఉగాది వేడుకలు కూడా జరగనున్నాయి.