PM Modi : ప్రధాని పదవికి మోడీ రాజీనామా

PM Modi
PM Modi : ప్రధాని పదవికి నరేంద్ర మోడీ నేడు (జూన్ 05) రాజీనామా చేశారు. తను రాజీనామా సమర్పించే ముందు జరిగిన చివరి మంత్రి మండలి సమావేశంలో ఎన్నికల ఫలితాలపై ఆయన మాట్లాడారు. గెలుపు, ఓటములు రాజకీయాల్లో భాగమని ఇది కేవలం అంకెల ఆట మాత్రమే అన్నారు. పదేళ్లుగా మంచి పనులు చేశామని, భవిష్యత్ లో కూడా మరిన్ని మంచి పనులు చేయబోతున్నామని మంత్రి మండలి సహచరులతో జరిగిన సమావేశంలో చెప్పారు.
పాలక సంస్థలు ప్రతీచోటా ప్రజల అంచనాలకు తగ్గట్టుగానే ఉన్నాయని, వాటికి అనుగుణంగానే కొనసాగుతాయని నరేంద్ర మోడీ అన్నారు. మీరంతా బాగా పనిచేశారని, చాలా కష్టపడ్డారని కితాబిచ్చారు. మోదీ చిరునవ్వు నవ్వుతూ అందరి మనోధైర్యాన్ని పెంచాలని అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. మంత్రులతో సమావేశం ముగిసిన అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యేందుకు వెళ్లిన మోదీ అక్కడ రాష్ట్రపతికి రాజీనామా పత్రాన్ని సమర్పించారు.
నరేంద్ర మోడీ, అధ్యక్షుడు ముర్ము ఫోటోలు కూడా అధికారిక ఎక్స్ నుంచి షేర్ చేశారు. రాజీనామాను ఆమోదించేటప్పుడు, కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు తమ పదవుల్లో కొనసాగాలని రాష్ట్రపతి ప్రధానమంత్రి, అతని సహచరులను అభ్యర్థించారు.
प्रधानमंत्री @narendramodi ने राष्ट्रपति भवन में राष्ट्रपति द्रौपदी मुर्मु से मुलाकात की। प्रधानमंत्री ने अपना और केन्द्रीय मंत्रिपरिषद का त्यागपत्र सौंपा। राष्ट्रपति ने त्यागपत्र स्वीकार करते हुए प्रधानमंत्री तथा उनके सहयोगियों से नई सरकार के गठन तक अपने पद पर बने रहने का… pic.twitter.com/n9yri078uH
— President of India (@rashtrapatibhvn) June 5, 2024
ప్రధాని రాజీనామా కేవలం ఫార్మాలిటీ మాత్రమే. ఎన్డీయే సమావేశంలో ప్రధాన మంత్రి అభ్యర్థిని ప్రకటించిన తర్వాత అది మోడీయే అయితే ఆయన రెండు మూడు రోజుల్లో రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు చెప్తారు. ఆ తర్వాత ప్రమాణ స్వీకారం చేస్తారు. మరో రెండు మూడు రోజుల్లో కొత్త కేంద్ర ప్రభుత్వం కొలువు దీరుతుంది.