Modi Promise : ఎస్సీ వర్గీకరణ కోసం దాదాపు పదేళ్లపాటు మంద క్రిష్ణ పోరాటం చేశారు. కానీ ఏం తేలలేదు. వర్గీకరణ అంశం కాస్త మరుగున పడిపోయింది. వర్గీకరణ సాధ్యం కాదని తేల్చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం మంద క్రిష్ణ ఏళ్ల పాటు పోరాటం చేశారు. ఊరూరా ఉద్యమమై ముందుకు కదిలారు. కానీ వర్గీకరణ సాధ్యం కాలేదు. రాష్ర్ట ప్రభుత్వం సరే అన్నా కేంద్రం నుంచి సానుకూలత లేకపోవడంతో వర్గీకరణ ముందుకు సాగలేదు.
దీంతో చాలా కాలం వర్గీకరణ అంశం మరిచిపోయారు. ఇప్పుడు మందక్రిష్ణ జోక్యంతో మళ్లీ వర్గీకరణపై ఆశలు పెరుగుతున్నాయి. ఇన్నాళ్లు ఎవరు పట్టించుకోకుండా దాన్ని పక్కన పెట్టేశారు. ఇప్పుడు ప్రధానమంత్రి దీనిపై విచారణ చేపట్టి పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మళ్లీ వర్గీకరణ అంశం తెరమీదకు వచ్చింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని ప్రకటించడంతో ఎస్సీ వర్గీకరణ అమలు దిశగా వెళ్లనుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ వర్గీకరణను మాల మహానాడు వ్యతిరేకించింది. అది బిల్లుగా మారడానికి వీలు లేదని ఆ సంఘం ఎమ్మార్పీఎస్ కు వ్యతిరేకంగా పోరాటం చేసింది. అప్పట్లో ఈ బిల్లు చట్టం కాకుండా చేయడంలో పైచేయి సాధించింది.
అందరు మరచిపోయిన తరుణంలో మళ్లీ వర్గీకరణ అంశం చర్చనీయాంశం కావడం విశేషం. ఈనేపథ్యంలో మోడీ వర్గీకరణ అమలు దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో ఇక ముమ్మరంగా పనులు ముందుకు సాగుతున్నాయని ఆశిస్తున్నారు. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ ఫైల్ కదలనున్నట్లు చెబుతున్నారు. ప్రధానమంత్రి పట్టించుకోవడంతో వర్గీకరణ సాధ్యమవుతుందని అనుకుంటున్నారు.