Modi Nomination : వారణాసిలో మోదీ నామినేషన్ – హాజరైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్

Modi Nomination in Varanasi
Modi Nomination : ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి లోక్ సభ స్థానానికి పీఎం నరేంద్ర మోదీ ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో అమిత్ షా, జేపీ నడ్డా, ఎన్డీయే నేతలు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.
వారణాసిలో నామినేషన్ కు ముందు పీఎం మోదీ కాలభైరవ ఆలయంలో పూజలు చేశారు. తొలుత గంగాతీరంలోని దశాశ్వమేధ ఘాట్ లో పూజలు చేశారు. అనంతరం హారతి ఇచ్చారు. దశాశ్వమేధ ఘాట్ నుంచి నమోఘాట్ కు చేరుకొని మోదీ పూజలు చేశారు. అక్కడి నుంచి కాలభైరవ ఆలయానికి ప్రధాని వెళ్లారు. అక్కడ పూజలు చేసిన అనంతరం మోదీ కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకొని వరుసగా మూడోసారి వారణాసి లోక్ సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారని. ఈ కార్యక్రమానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హాజరయ్యారు.
TAGS amith shahBJPchandrababu naiduJP NaddaLoksabha Elections 2024Modi NominationModi Nomination in VaranasiPawan KalyanVaranasiyogi adityanath