JAISW News Telugu

PM Modi : మోడీనే రంగంలోకి.. యుద్ధ విమానం నడిపితే ఎట్లా ఉంటుందో తెలుసా? వైరల్ వీడియో

PM Modi

PM Modi

PM Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తేజస్ యుద్ధ విమానంలో చక్కర్లు కొట్టారు. స్వదేశీ సాంకేతిక పరిజ్ణానంతో తయారు చేసిన యుద్ధ విమానం తేజస్ లో ఉత్సాహంగా విహరించారు. శనివారం ఉదయం బెంగుళూరు హెచ్ఏఎల్ కంపెనీని సందర్శించిన ఆయన తేజస్ ఫైటర్ జెట్ల గురించి తెలుసుకుని అందులో ప్రయాణించారు. మన వైమానిక దళంలో తేజస్ విమానం ప్రత్యేకతలు కలిగి ఉంది.

తేజస్ దేశీయంగా తయారైన సింగిల్ ఇంజిన్ యుద్ధవిమానం కావడంతో ఆర్మీ, వాయుసేన కోసం దీన్ని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెల్ తేజస్ ను రూపొందించింది. దీంతో శత్రుదేశాలకు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. శత్రువుల బారి నుంచి రక్షించుకునే క్రమంలో తేజస్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అందుకే తేజస్ యుద్ధరంగంలో శత్రువులకు హెచ్చరికలు చేసేందుకు రెడీగా ఉంటోంది.

మోడీ ప్రత్యేక డ్రెస్ వేసుకుని హెల్మెట్ పెట్టుకుని ఆకాశంలో విహరించారు. తేజస్ తయారు గురించి అడిగి తెలుసుకున్నారు. పూర్తిగా దేశీయ సహకారంతో తయారు చేసిన విమానం శత్రువుల గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తుందని వ్యాఖ్యానించారు. తేజస్ తయారులో మన వారి పనితనం ఎంతో తెలుస్తుందని గుర్తు చేశారు. దేశ ప్రయోజనాల కోసం వారి సహకారం ఇలాగే ఉండాలని ఆకాంక్షించారు.

బెంగుళూరులో ప్రధాని తేజస్ లో విహరించి దాని పనితనం తెలుసుకున్నారు. అది ప్రయాణించే వేగం చూసి ఆశ్చర్యపోయారు. మన విమాన యాన సంస్థల పనితీరు పట్ల ప్రశంసలు కురిపించారు. దేశ రక్షణలో విమానాల పాత్ర ఎంతో విశిష్టమైనది. ఇలా మన దేశ భద్రతకు విమానాలు సాయపడతాయి. వాటితో మనం ఇతర దేశాల రాకను అడ్డుకోవడానికి ఎంతో దోహదపడతాయి.

Exit mobile version