Indian Army : ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో సైన్యాన్ని ఉద్దేశించి మాట్లాడిన ఆయన, ఉగ్రవాదంపై పోరులో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు ప్రకటించారు. డేట్, టైమ్, టార్గెట్ ఫిక్స్ చేసి తగిన ప్రతిచర్య తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా అంతం చేస్తామని స్పష్టం చేసిన ప్రధాని, భారత సైన్యంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు.
- పాక్ కంటే మన సైన్యం ఖర్చు తొమ్మిది రెట్లు ఎక్కువ..
భారత్ సైనిక ఖర్చు పాకిస్తాన్ కంటే తొమ్మిది రెట్లు ఎక్కువగా ఉందని స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ విడుదల చేసిన తాజా నివేదిక వెల్లడించింది. 2024లో భారత్ డిఫెన్స్‌కు 7.19 లక్షల కోట్లు ఖర్చు చేయగా, పాకిస్తాన్ 87 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. ప్రపంచంలో అత్యధికంగా సైనిక ఖర్చు చేస్తున్న దేశాల్లో భారత్ ఐదవ స్థానంలో నిలిచింది. మొదటి నాలుగు స్థానాల్లో అమెరికా, చైనా, రష్యా, జర్మనీ ఉన్నాయి. ఈ ఐదు దేశాలే ప్రపంచ సైనిక ఖర్చులో 60 శాతం వాటా కలిగి ఉన్నాయి