Modi Effect : మోడీ ఎఫెక్ట్ లక్షద్వీప్ అనలేదని పెళ్లి మానేసాడే!

modi effect Lakshadweep Vs Maldives viral video
Modi Effect Lakshadweep Vs Maldives : భారత ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్ వెళ్లి వచ్చినప్పటి నుంచి చాలా మారిపోయాయి. భారత్ నుంచి చాలా మంది ప్రముఖులు అప్పుడప్పుడు చిల్ అయ్యేందుకు మాల్దీవ్స్ వెళ్తుంటారు. దీంతో అక్కడి పర్యటక రంగం విపరీతంగా డెవలప్ అయ్యింది. కానీ మల్దీవ్స్ ప్రభుత్వం మాత్రం భారత్ దాయాది దేశం చైనాకు తొత్తుగా పని చేస్తుంది. దీంతో ప్రధాని మోడీ దీనికి చెక్ పెట్టేందుకు ఒక్క రోజు లక్షద్వీప్ వెళ్లి పర్యాటకానికి ఈ దీవులు అత్యంత అనువైనవని చెప్పారు. దీంతో మాల్దీవుల మంత్రులు భారత్ ను ప్రధానిని తూలనాడారు. ఇంకేముంది. భారతీయులు టూరిస్ట్ ప్లేస్ లిస్ట్ నుంచి మాల్దీవులను డిలీట్ చేశారు. దీంతో ఇప్పుడు ఆ ప్రభుత్వం లబోదిబో అంటుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం లేదన్నట్లు అన్నీ అయిపోయాక.. మంత్రులను పక్కన పెట్టింది ఆ దేశ ప్రభుత్వం.
ఇవన్నీ అటుంచితే మోడీ లక్షద్వీప్ పర్యటనకు చేపట్టి వచ్చిన తర్వాత అక్కడికి టూరిస్ట్ లు క్యూ కడుతున్నారు. కేరళలోని కొచ్చికి వచ్చి అక్కడి నుంచి బై ఎయిర్, బై వాటర్ ద్వారా లక్షద్వీప్ వెళ్తున్నారు. ఈ జర్నీ గురించి వీడియోలు చేస్తూ యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేస్తూ.. అందరికీ అవగాహన కల్పిస్తున్నారు. ఇక లక్షద్వీప్ కూడా పర్యాటకులు వచ్చేందుకు సూచనలు చేస్తూ.. వారికి కావలసిన వసతులను కల్పిస్తుంది. మోడీ పర్యటన తర్వాత ఇప్పటికే యూట్యూబ్ లో లక్షద్వీప్ కు వెళ్లే దారులు, అయ్యే ఖర్చులకు సంబంధించి పదుల సంఖ్యలో వీడియోలు చేశారు.
లక్షద్వీప్, మల్దీవ్ గురించి ఫన్నీ ఫన్నీ పోస్ట్ లు, వీడియోలు, మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో మరింత ఫన్నీగా కనిపించింది. అదేంటంటే.. ఒక జంట పెళ్లి చూపుల కోసం ఒక రెస్టారెంట్ లో కలుస్తారు. చాయ్ నుంచి అన్నీ వారి అభిప్రాయాలు కలుస్తాయి. దీంతో వరుడి ప్లేస్ లో ఉన్న అతను తనకు అమ్మాయి నచ్చిందని ఇంటికి కూడా ఫోన్ చేసి చేప్తాడు. తీరా హనీమూన్ గురించి మాట్లాడుకునే సమయంలో అమ్మాయి మల్దీవ్స్ అంటుంది. దీంతో లక్షద్వీప్ అంటూ సదరు పురుషుడు వివాహాన్ని క్యాన్సిల్ చేసి వెళ్లిపోతాడు. ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.