
Kangana Ranaut-Modi
Kangana Ranaut : ప్రధాని మోదీ అంటేనే ఒక రోల్ మోడల్ అని బీజేపీ ఎంపీ అభ్యర్థి కంగనా రనౌత్ అన్నారు. మహిళల అభివృద్ధికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారన్నారు. అందులో భాగంగానే తనకు టికెట్ వచ్చిందన్నారు. అంటే.. మహిళలకు మోదీ ఏ విధంగా ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థం చేసుకోవాలన్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని మండీ ఎంపీ సెగ్మెంట్ లో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో కంగనా రనౌత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
కాగా, కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న మండి లోక్ సభ స్థానం నుంచి బీజేపీ తరపున కంగన పోటీ చేస్తుండడంతో ఆసక్తికరంగా మారింది. దివంగత మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్ ఇక్కడ కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్నారు. జూన్ 1న మండలో పోలింగ్ జరగనుంది.