Dr. Jai Yalamanchili : ప్రపంచం అత్యంత ఉత్కంఠ భరితంగా ఎదిరిచూసే అరుదైన క్షణం మోడీ ప్రమాణ స్వీకారోత్సవం. ఈ రోజు (జూన్ 9 – ఆదివారం) రాత్రి 7 గంటలకు ప్రధానితో పాటు అతని కేబినెట్ కూడా ప్రమాణ స్వీకారం చేయనుంది. దీనికి చాలా దేశాల నుంచి ప్రముఖులు హాజరవుతున్నారు. అత్యంత గొప్ప ప్రజాస్వామిక దేశమైన భారత్ లో మోడీ వరుసగా మూడో సారి విజయంతో ప్రపంచం యావత్తు ఆశ్చర్యానికి గురైంది. ఒక నేత మూడు సార్లు వరుసగా పాలించడం, అది కూడా అత్యంత గొప్పదైన ప్రజాస్వామ్య దేశం భారత్ ను అంటే అతి శయోక్తి కాదు.
ఇంక, ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గెలుపు మరో సువర్ణాధ్యాయం. చంద్రబాబు గెలుపుపై అమెరికాలో ఎన్ఆర్ఐలు సంబురాలు చేసుకున్నారు. ర్యాలీలు తీస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. వేడుకల్లో డాక్టర్ జై జగదీష్ బాబు యలమంచిలి ఫౌండర్ యూబ్లడ్ యాప్ గారు పాల్గొని అందరినీ ఉత్సాహ పరిచారు. ఆయన మాట్లాడుతూ బాబు రావడమే ప్రతీ ఎన్ఆర్ఐ బాధ్యతగా తీసుకున్నాడన్నారు. ‘సైకో పోవాలి సైకిల్ రావాలి’ అంటూ బాబు ఇచ్చిన పిలుపునకు తెలుగు నేలతో పాటు విదేశాలు కూడా కదిలాయని జగదీష్ బాబు గారు అన్నారు. ప్రతీ ఒక్కరి మనసులో, ప్రతీ ఒక్కరి ఇంట్లో చంద్రబాబు తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారన్నారు.
సైకోను సాగనంపిన తెలుగు వారికి ధన్యవాదాలు చెప్పుకున్న జగదీష్ బాబు గారు మోడీ, బాబు, పవన్ ముగ్గురు దేశం, రాష్ట్రంలో కీలకంగా మారారన్నారు. మోడీ మూడో సారి ప్రభుత్వం ఏర్పాటు చేసి (3.Oగా), చంద్రబాబు ఏపీలో మరో సారి ప్రభుత్వం ఏర్పాటు చేసి (2.Oగా), పవన్ కళ్యాణ్ మొదటి సారి ప్రభుత్వం ఏర్పాటు చేసి (1.O)గా 1, 2, 3గా దేశంలో గొప్ప వ్యక్తులుగా చరిత్రలో నిలిచిపోతారన్నారు.
ఇక, ఏపీ విషయం తీసుకుంటే వేగంగా అభివృద్ధి జరుగుతుందని ఘంటాపథంగ చెప్తానని అన్నారు. అక్కడ నరేంద్రుడు, ఇక్కడ చంద్రుడు ఇద్దరూ ఏపీ డెవలప్ కు కట్టుబడి పని చేస్తారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదన్నారు. మోడీ పదేళ్లలో ప్రపంచంలో ఐదో స్థానంలో భారత్ ను నిలబెట్టారని, చంద్రబాబు నాయుడు కూడా ఆయనను ఆదర్శంగా తీసుకొని డెవలప్ విషయంలో రాజీ లేకుండా కష్టడతారన్నారు. అందుకు పవణ్ కళ్యాణ్ అండదండలు ఉన్నాయని డాక్టర్ జై జగదీష్ బాబు యలమంచిలి ఫౌండర్ యూబ్లడ్ యాప్ గారు తెలిపారు.