mobile phone services : సెల్ ఫోన్ టవర్స్ లేకున్నా సిగ్నల్స్.. డైరెక్ట్ ఉపగ్రహం నుంచి ఎలన్ మస్క్ మరో సంచలన అడుగులు
* స్టార్ లింక్ ఉపగ్రహం నుంచి మొబైల్ ఫోన్ సేవలు.. ఈనెల 27 నుంచి టెస్టింగ్స్
mobile phone services ఎలాన్ మస్క్ మరో సంచలన అడుగులు వేస్తున్నారు. తన సంస్థ స్టార్లింక్ ద్వారా ఉపగ్రహాల నుంచి డైరెక్ట్ మొబైల్ ఫోన్ కు సిగ్నల్స్ ఇచ్చే సేవల్లో గొప్ప ముందడుగు వేశారు. ఈ టెస్ట్ సిగ్నల్స్ ను జనవరి 27 నుండి ప్రారంభమవుతున్నాయి.
ఈ సేవల ద్వారా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొబైల్ ఫోన్ వినియోగదారులు సిగ్నల్స్ లేకపోయినా కూడా స్టార్లింక్ ఉపగ్రహాల ద్వారా నేరుగా కనెక్ట్ అవగలరు. ఇది ప్రత్యేకించి రిమోట్ ప్రాంతాల్లో.. సిగ్నల్స్ అందని ప్రదేశాల్లో ఉపయోగకరంగా ఉంటుందని అంచనా. ఇదే పద్ధతిలో మస్క్ వెల్లడించిన ఈ ప్రాజెక్ట్, సాంకేతిక రంగంలో విప్లవాత్మకమైనదిగా భావిస్తున్నారు.
-డైరెక్ట్-టు-సెల్ ఉపగ్రహ సేవ అంటే ఏమిటి?
ఈ సేవల ద్వారా మొబైల్ ఫోన్లు నేరుగా ఉపగ్రహాలతో కనెక్ట్ అవుతాయి. సంప్రదాయ సెల్యులర్ లు మారుమూల ప్రాంతాలు, గ్రామాలకు సిగ్నల్స్ అందించలేకపోతున్నాయి. మౌలిక వసతులు కల్పించకపోవడంతో చాలా చోట్ల సిగ్నల్స్ లేక ఫోన్లు వాడని పరిస్థితి నెలకొంది. ఇప్పుడీ ఉపగ్రహం ద్వారా సిగ్నల్స్ ఇస్తే కమ్యూనికేషన్ సదుపాయాన్ని ఈ భూమ్మీద ఎంతటి మారుమూల ప్రాంతంలోనైనా కల్పించడానికి వీలవుతుంది..
టెక్స్ట్, కాల్స్, ఇంటర్నెట్ బ్రౌజింగ్ వంటి సేవలు ఎక్కడ నుండి అయినా ఈ స్టార్ లింక్ ద్వారా పొందొచ్చు. గిరిజన ప్రాంతాలు.. సెల్ టవర్స్ లేని ప్రదేశాల్లో కూడా అందుబాటులో ఉంటాయి.
కొత్త ఫోన్లు లేదా అదనపు హార్డ్‌వేర్ అవసరం లేకుండా ప్రస్తుతం వినియోగిస్తున్న డివైస్‌లతోనే ఈ సేవలు పనిచేస్తాయి.
ఈ సేవలను “ఆకాశంలో సెల్ టవర్స్”గా అభివర్ణిస్తున్నారు.. ఇది డెడ్ జోన్లను తొలగించడంలో కమ్యూనికేషన్ మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇదో విప్లవాత్మక ముందడుగుగా భావిస్తున్నారు.
ఈ బీటా పరీక్ష దశ స్పేస్‌ఎక్స్‌కు మరో కీలక మైలురాయి. విజయవంతమైతే, ఈ సేవలు ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో లేని ప్రాంతాల్లో నివసించే ప్రజలకు.. ప్రయాణికులకు అత్యంత ఉపయోగకరంగా నిలుస్తాయి. అత్యవసర పరిస్థితుల్లో సంప్రదాయ నెట్‌వర్క్‌లు విఫలమయ్యే సమయంలో కూడా ఈ సేవలు కీలక పాత్ర పోషించగలవు.