MLC Kavitha : అనారోగ్య సమస్యతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో మంగళవారం చేరారు. వైద్య పరీక్షల కోసం ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. మంగళవారం సాయంత్రం వరకు వైద్య పరీక్షలు పూర్తవుతాయని డాక్టర్లు తెలిపారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కాం కేసులో తీహార్ జైలులో ఉన్న సమయంలో గైనిక్ సమస్యలు, తీవ్ర జ్వరంతో కవిత పలుసార్లు అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. ఢిల్లీలోని ఎయిమ్స్ లో కవితకు గతంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. కవిత గైనిక్ సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం.
లిక్కర్ స్కాం కేసులో 5 నెలల పాటు జైలులో గడిపిన తర్వాత సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో కవిత ఇటీవలే జైలు నుంచి రిలీజ్ అయ్యారు. అప్పటి నుంచి ఆమె ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఇంటికే పరిమితమయ్యారు.