YSRCP : వైసీపీకి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా

YSRCP
YSRCP : వైసీపీకి మరో నేత గుడ్ బై చెప్పారు. తాజాగా కైకలూరుకు చెందిన ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ వైసీపీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన జయమంగళ వెంకటరమణ తన రాజీనామా లేఖను ఏపీ శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజుకు పంపించారు. ఎమ్మెల్సీ పదవితో పాటు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు జయమంగళ వెంకటరమణ ప్రకటించారు.
గతంలో టీడీపీలోనే కొనసాగిన జయమంగళ వెంకటరయమణ, ఎన్నికలకు కొద్దిరోజుల ముందు వైసీపీలో చేరారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత పార్టీకి ఆయన అంటీముట్టనట్లు ఉన్నారు. ఈ క్రమంలో జయమంగళ వెంకట రాజీనామా చేశారు.