Vangaveeti Radha : వంగవీటి రాధాకు ఎమ్మెల్సీ దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తోంది. ఇటీవల అనారోగ్యానికి గురై కోలుకుంటున్న రాధాను ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ పరామర్శించిన సందర్భంగా ఎమ్మెల్సీ హామీ లభించినట్లు సమాచారం. ఏపీ క్యాబినెట్ లో ఖాళీగా ఉన్న బెర్త్ ను రాధాకు కేటాయించాలన్న ఆలోచనలో టీడీపీ అధిష్టానం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలో త్వరలో జరగబోయే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాధాను నామినేట చేయాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా భావిస్తున్నట్లు సమాచారం.
దివంగత కాపు నేత వంగవీటి రంగా రాజకీయ వారసుడిగా వంగవీటి రాధ రాజకీయాల్లోకి వచ్చారు. 2004లో కాంగ్రెస్ పార్టీతో రాజకీయ అరంగేట్రం చేసి విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యేగా గెలిచిన రాధ ఆ తర్వాత మరోసారి 2009లో ప్రజారాజ్యం తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఒక, రాష్ట్ర విభజన అనంతరం 2014లో వైసీపీ తరపున పోటీ చేసిన రాధ మరోసారి ఓడిపోయారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన రాధాకు 2024లో కూడా సామాజిక సమీకరణాలు, కూటమిలో మిగతా పార్టీలకు సీట్ల కేటాయింపు నేపథ్యంలో టికెట్ దక్కలేదు.