MLC counting : వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతోంది. ఎన్నికల కౌంటింగ్ లో సెకండ్ ప్రయారిటీ ఓట్లలో బీజేపీ అభ్యర్థి ప్రేమేంద్ర రెడ్డిని సిబ్బంది ఎలిమినేట్ చేశారు. ఇప్పటి వరకు 42 మంది అభ్యర్థులు ఎలిమినేషన్ అయ్యారు. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి మధ్యనే పోటీ సాగుతోంది. ఎలిమినేషన్ రౌండ్ తో వీళ్లిద్దరికీ సమానంగా ఓట్లు రావడంతో.. గెలువు ఎవరిది అనే ఆసక్తి నెలకొంది.
ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేషన్ తర్వాత తీన్మార్ మల్లన్నకు 1,23,709 ఓట్లు, రాకేష్ రెడ్డికి 1,04,846 ఓట్లు వచ్చాయి. దీంతో తీన్మార్ మల్లన్న 19 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కీలకంగా ఉన్న బీజేపీ అభ్యర్థి ప్రేమేంద్ర రెడ్డి, స్వతంత్ర అభ్యర్థి అశోక్ ఎలిమినేషన్ తర్వాత కూడా తీన్మార్ మల్లన్న ఆధిక్యంలో ఉండడంతో గెలుపు ఖాయమనే అంచనాలు ఊపందుకున్నాయి. రాత్రి 9 గంటల కల్లా తుది ఫలితం వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు.