Teenmar Mallanna : వరంగల్-ఖమ్మం-నల్గొండయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు రెండో రౌండ్ పూర్తయేసరికి తీన్మార్ మల్లన్న ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మూడో రౌండ్ కౌంటింగ్ సాగుతోంది. మొదటి రౌండ్ లో 7.670 ఓట్ల ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, రెండో రౌండూ పూర్తయ్యేసరికి 14,672 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఈ రౌండ్ లో మల్లన్నకు 34,575 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డికి 27,573, బీజేపీ అభ్యర్థి ప్రేమేంద్ర రెడ్డికి 12,841 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి అశోక్ కు రెండో రౌండ్ లో 11,018 ఓట్లు వచ్చాయి.
బుధవారం ఉదయం 8 గంటలకు నల్గొండలోని దుప్పలపల్లి గిడ్డంగుల సంస్థ గోదాముల్లో బుధవారం ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 605 పోలింగ్ కేంద్రాల్లో పోలైన 3.36 లక్షల బ్యాలెట్ పత్రాలను 25 చొప్పున కట్టలు కట్టారు. ఒక్కో హాల్లో 24 టేబుళ్ల చొప్పున మొత్తం నాలుగు గదుల్లో 96 టేబుళ్లను ఏర్పాటు చేశారు.