JAISW News Telugu

Pinnelli Ramakrishna : ఏపీ హైకోర్టులో ఎమ్మెల్యే పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్

Pinnelli Ramakrishna

Pinnelli Ramakrishna

Pinnelli Ramakrishna : పోలింగ్ రోజు ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పరిధిలోని పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనను ఈసీ సీరియస్ గా తీసుకుంది. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో పిన్నెల్లి ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు. కాసేపట్లో విచారణ చేపట్టనుంది.

మే 13న పోలింగ్ రోజు ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో ఏ1గా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఇప్పటికే పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక టీంలతో గాలిస్తున్నారు. మే 22న హైదరాబాద్ లో పిన్నెల్లి కారును గుర్తించి డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు పిన్నెల్లి లొంగిపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో పోలీసులు నరసరావుపేట కోర్టు దగ్గర భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు.

Exit mobile version