MLA Kolikapudi : ఎమ్మెల్యే కొలికపూడిని సస్పెండ్ చేయాలి.. రోడ్డుపై మహిళల నిరసన

MLA Kolikapudi
MLA Kolikapudi : మహిళా ఉద్యోగుల వాట్సాప్ నంబర్లకు అసభ్యకరంగా సందేశాలు పంపిస్తూ లైంగికంగా వేధిస్తున్న ఎమ్మెల్యే కొలొకపూడి శ్రీనివాసరావును టీడీపీ అధిష్ఠానం సస్పెండ్ చేయాలని మహిళలు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలంలోని చిట్టేలలో సోమవారం మహిళలు ప్రధాన రోడ్డుపై నిరసన ప్రదర్శన జరిపారు. మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే నుంచి రక్షణ కల్పించాలని కోరారు. కొలికపూడిపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఉద్యమం తీవ్రం చేస్తామని హెచ్చరించారు.
తనపై చేసిన ఆరోపణలు నిజమైతే అరెస్టు చేసి శిక్షించాలని, లేని పక్షంలో ఆరోపణలు చేసిన వారిని శిక్షించాలని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో సోమవారం రాత్రి నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనపై ఆరోపణలు చేస్తున్న మహిళ ఇప్పటి వరకు నాలుగుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించారని, ఆమె భర్తపై పోలీసులు ఎప్పుడు కేసు పెట్టినా ఇలాంటి ఆత్మహత్య నాటకం అడుతారని ఆరోపించారు.