IPL Action:ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మినీ వేలంలో ఆసీస్ ఆటగాడు మిచెల్ స్టార్క్ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరను సొంతం చేసుకున్న ఆటగాడిగా నిలిచాడు. స్టార్క్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.24.75 కోట్లకు దక్కించుకుంది. స్టార్క్ కోసం గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా చివరి వరకు పోటీపడ్డాయి. ఆ తరువాత ఆసీస్ కెప్టెన్ కమిన్స్ రూ.20.5 కోట్లు దక్కించుకుని రెండో స్థానంలో నిలిచాడు.
అతడిని సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది. న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ డారిల్ మిచెల్‌ను రూ.14 కోట్లు పెట్టి చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. భారత పేసర్ హర్షల్ పటేల్‌ను రూ.1175 కోట్లకు పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. వరల్డ్ కప్ ఫైనల్‌లో సెంచరీ సాధించి ఆసీస్‌ను గెలిపించిన ట్రావిస్ హెడ్‌ను ఎస్ఆర్‌హెచ్ రూ.6.8 కోట్లకు సొంతం చేసుకుంది.
ఆల్‌రౌండర్ వనిందు హసంగను కూడా రూ. 1.5 కోట్లకు తీసుకుంది. ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్‌ను రూ.4.2 కోట్లు పెట్టి పంజాబ్ దక్కించుకుంది. శార్దూల్‌ను (రూ.4కోట్లు), సచిన్ రవీంద్ర (రూ.1.50 కోట్లు) చెన్నై సూపర్ కింగ్స్ వేలంలో సొంతం చేసుకుంది.