Missing Case : మే 28న అమెరికాలో అదృశ్యమైన భారతీయ విద్యార్థిని ఆచూకీ లభించిందని, ప్రస్తుతం ఆమె క్షేమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీకి చెందిన పోలీస్ చీఫ్ జాన్ గుట్టీరెజ్, సెయింట్ బెర్నార్డో పోలీస్ డిపార్ట్‌మెంట్ ఎక్స్(ట్విట్టర్)లో కందుల నితీషా ఆచూకీ గురించి పోస్ట్ చేశారు. అయితే, ఆమె ఎలా ఎక్కడ దొరికింది అనే వివరాలేవీ చెప్పలేదు.
‘మే 28, 2024న లాస్ ఏంజెల్స్‌లో తప్పిపోయినట్లు తమకు ఫిర్యాదు అందింది. అంతకు ముందు లాస్ ఏంజెల్స్‌లో చివరిగా కనిపించింది. ఆమె శాన్ బెర్నార్డినోలోని కాలిఫోర్నియా స్టేట్ యూనివరసిటీకి చెందిన విద్యార్థిని, ఆమె మిస్సింగ్ రిపోర్ట్ మే 30న దాఖలయ్యాయి. పోలీసు చీఫ్ జాన్ గుట్టీరెజ్ ఎక్స్ (ట్విటర్)లో ఒక పోస్ట్‌లో తెలియజేశారు.
ఈ ఏడాది అమెరికాలో భారతీయ విద్యార్థులు తప్పిపోవడం లేదా చనిపోయినట్లు అనేక ఘటనలు నమోదయ్యాయి. ఏప్రిల్‌లో, మొహమ్మద్ అబ్దుల్ అర్ఫాత్ (25) అనే భారతీయ విద్యార్థి, మార్చిలో కనిపించకుండా పోయిన తర్వాత USలోని ఓహియో రాష్ట్రంలోని క్లీవ్‌ల్యాండ్‌లో శవమై కనిపించాడు. హైదరాబాద్‌కు చెందిన అతను క్లీవ్‌ల్యాండ్ యూనివర్సిటీలో ఐటీ విద్యార్థి.
మార్చిలో, భారతదేశానికి చెందిన శిక్షణ పొందిన భారతీయ శాస్త్రీయ నృత్యకారుడు అమర్‌నాథ్ ఘోష్ USలోని మిస్సోరీలో హత్య చేశారు. 34 సంవత్సరాల వయస్సున్న అమర్ నాథ్ సెయింట్ లూయిస్‌లోని వాషింగ్టన్ యూనివర్సిటీలో డాన్స్‌లో MFA చదువుతున్నాడు.
ఫిబ్రవరిలో భారతీయ-అమెరికన్ విద్యార్థి సమీర్ కామత్ శవమై కనిపించాడు. ఆత్మహత్య చేసుకున్నాడని ఆ తర్వాత తెలిసింది. అతను యూఎస్ ఇండియానా రాష్ట్రంలోని పర్డ్యూ విశ్వవిద్యాలయంలో విద్యార్థి. మరో భారతీయ-అమెరికన్ ఐటీ ఎగ్జిక్యూటివ్ వివేక్ తనేజా (41) ఫిబ్రవరి 2న వాషింగ్టన్‌లోని జపనీస్ రెస్టారెంట్ వెలుపల దాడిలో మరణించాడు.
జనవరిలో, 18 ఏళ్ల భారతీయ-అమెరికన్ విద్యార్థి అకుల్ ధావన్ విశ్వవిద్యాలయ క్యాంపస్ వెలుపల శవమై కనిపించాడు. ఇల్లినాయిస్‌లోని ఛాంపెయిన్ కౌంటీ కరోనర్ కార్యాలయం ప్రకారం.. అతను ఆల్కహాల్, గడ్డకట్టే ఉష్ణోగ్రతలకు ఎక్కువ సమయం ఉండడం వల్లే మరణించాడని తెలిసింది.
ఇవన్నీ పక్కన పెడితే విద్యార్థిని కనిపించడంలో ఇండియాలోని ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు ఊపిరి పీల్చుకున్నారు.