Pawan Kalyan : విమానాశ్రయంలోనే పవన్ కల్యాణ్ కు మిస్సింగ్ కంప్లైంట్
Pawan Kalyan : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రేణిగుంట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే గన్నవరం విమానాశ్రయంలో వివాహిత కనిపించకపోవడంతో ఆమె బంధువులు డిప్యూటీ సీఎంను ఆశ్రయించారు. అయితే ఈ నెల 8న విజయవాడ దుర్గమ్మను దర్శించుకునేందుకు ముదినేపల్లి నుంచి వచ్చిన వివాహిత అదృశ్యమైంది. ముదినేపల్లి మండలం ముదినేపల్లి గ్రామానికి చెందిన వివాహిత కె.మహాలక్ష్మి బవని (32)పై ముదినేపల్లి పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది.
తమ సోదరి తప్పిపోయిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను సంప్రదించగా.. ప్రత్యేక బృందాలతో విచారణ చేయించి మీకు అందజేసే బాధ్యత నాదేనని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. మిస్ అయిన వివాహిత బంధువులు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం డిప్యూటీ సీఎం మంగళగిరి విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో పార్టీ కార్యాలయానికి బయలుదేరారు.
ఎన్నికల్లో గెలిచి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పవన్ ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిష్కరించే పనిలో పడ్డారు. రాష్ట్రంలోని ప్రతి మూల నుంచి తన కార్యాలయానికి వచ్చిన అర్జీలను పరిశీలించారు. తన కార్యాలయ సిబ్బందితో కలిసి ప్రతి అర్జీని చదువుతూ వాటికి పరిష్కార మార్గాలు వెతికే పనిలో ఉన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా, పర్యావరణం, అటవీ శాఖలపై వచ్చిన అర్జీలతోపాటు సమస్యలు, ఇబ్బందులను ఏకరవు పెడుతూ ప్రజల నుంచి అనేక వినతులు వచ్చాయి.