JAISW News Telugu

Missed ten days : క్యాలెండర్ లో పది రోజులు మిస్.. ఎక్కడికి వెళ్లాయి.. ?

Missed ten days in Calendar

Missed ten days in Calendar

Missed ten days in Calendar : మనిషి నాగరికత వైపునకు ప్రయాణిస్తున్న కొద్దీ ఒక్కో ఆవిష్కరణ ఉద్భవిస్తూ వెళ్తుంది. అందులో రోజు గురించి తెలుసుకునేందుకు ఉపయోగించే క్యాలెండర్ కూడా ఒకటి. అయితే అప్పట్లో ఈ క్యాలెండర్లు ఒక్కో ప్రాంతం, ఒక్కో మత విశ్వాసం ఆధారంగా మారుతుండేవి. ప్రస్తుతం మనం వాడుతున్న క్యాలెండర్ పేరు ‘గ్రెగోరియన్’. 1582 వరకు ‘జూలియన్’ క్యాలెండర్ అమల్లో ఉండేది. ఇది సూర్యుడి పయనం ఆధారంగానే రూపొందించింది. ఆ తర్వత వచ్చిన గ్రెగోరియన్ క్యాలెండర్ కూడా సూర్యుడి పయనం ఆధారంగానే రూపొందించారు. అక్టోబర్ 4వ తేదీ తర్వాత అక్టోబర్ 15వ తేదీ ఉంటుంది. అంటే 10 రోజులు క్యాలెండర్ నుంచి మిస్సయ్యాయని తెలుస్తుంది. మరి ఈ పది రోజులు ఎక్కడికి వెళ్లాయి. వాటి గురించి తెలుసుకుందాం.. అక్టోబర్ 4వ తేదీ వరకు జూలియన్ క్యాలెండర్ ఉపయోగించారు. ఈ క్యాలెండర్ సోలార్ క్యాలెండర్ ను 11 నిమిషాలు మిస్ క్యాలిక్యులేట్ చేసింది. దీంతో తర్వాత వచ్చిన గ్రెగోరియన్ క్యాలెండర్ లో 10 రోజులు మిస్సయ్యాయి. గ్రెగోరియన్ క్యాలెండర్ అక్టోబర్ 15, 1582 నుంచి ప్రారంభమైంది. ఈ పది రోజుల్లో ఎవరి పుట్టకను, చావును ఇతర వేడుకలను కౌంట్ చేయలేదు. అంటే ఈ పది రోజుల మధ్యలో పుట్టిన వారికి డేట్ ఆఫ్ బర్త్, చనిపోయిన వారికి డేట్ ఆఫ్ డెత్ లేదన్నమాట.

Exit mobile version