Miss India-2024 : ఫెమినా మిస్ ఇండియా వరల్డ్-2024 విజేతగా నికితా పోర్వాల్ నిలిచింది. బుధవారం రాత్రి ముంబైలో జరిగిన ఈ ఫెమినా అందాల పోటీలో నికితా విజయకేతనం ఎగురవేసి కిరీటాన్ని దక్కించుకుంది. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినికి చెందిన నికితా మంచి స్టోరీ టెల్లర్. ఆ అభిరుచికి జీవం పోయాలనే ఉద్దేశ్యంతోనే సుమారు 60కి పైగా నాటకాలలో నటించింది. మిస్ వరల్డ్ పోటీల్లో భారత్ తరపున ఆమె ప్రాతినిథ్యం వహించనున్నారు. రేఖా పాండే, ఆయుశీ దోలకియా మొదటి, రెండవ రన్నరప్ లుగా నిలిచారు.
60వ ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో భాగంగా 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన అందాల భామలు పోటీపడ్డారు. కేవలం తమ అందాలతోనే కాదు, ప్రతిభతోనూ జడ్జిల నుంచి ప్రశంసలు అందుకున్నారు. తుది పోరులో అదరగొట్టిన నికితా పోర్వాల్ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు.