Artificial Intelligence : ‘ఏఐ’తో అద్భుతాలు.. రానున్న ఐదేళ్లలో ఏలియన్స్ గుట్టురట్టు
Artificial Intelligence : ఇప్పుడు ఎక్కడ విన్నా ఏఐ ఏఐ ఏఐ.. ప్రస్తుతం మనం కృత్రిమ మేధ కాలంలో ఉన్నాం. ఎక్కడ చూసినా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ గురించే చర్చలు నడుస్తున్నాయి. ప్రతి రంగంలోకి ఏఐ ప్రవేశిస్తోంది. తన శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తూ ప్రపంచాన్ని అశ్చర్యపరుస్తోంది. అయితే ఇది ప్రారంభం మాత్రమే.. రానున్న కాలంలో మరిన్ని అద్భుతాలు ఏఐ ద్వారా ఆవిష్కృతమవుతాయని నిపుణులు చెబుతున్నారు. దానికి మరెంతో ఎక్కువ సమయం కూడా పట్టదని స్పష్టం చేస్తున్నారు. రానున్న ఐదేళ్ల కాలంలో ఏఐ కొత్త శిఖరాలను అధిరోహిస్తుందని చెబుతున్నారు. ఏఐ అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఏఐ అభివృద్ధి తర్వాత సైంటిస్టులు ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ (ASI) గురించి ఆలోచిస్తున్నారు. ఇది మానవ సామర్థ్యాలకు మించిన తెలివితేటలతో, మనం అర్థం చేసుకోగలిగిన దానికంటే ఎన్నో రెట్ల వేగంతో పని చేస్తుంది. కానీ ఇది మన నాగరికత భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తుందన్న దానిపూ ఆందోళనలు కూడా ఉన్నాయి.
ఆక్టా ఆస్ట్రోనాటికా జర్నల్‌లో రీసెంట్ గా పబ్లిష్ అయిన రిసెర్చ్ డాక్యుమెంట్లో సైంటిస్టులు ఏఐ, యూనివర్సల్ ‘గ్రేట్ ఫిల్టర్’ ఐడియా గురించి చర్చించారు. ఇది నాగరికతల దీర్ఘకాలిక మనుగడకు సవాలుగా ఉండనుంది. ఈ హైపోథిసీస్ ఫెర్మీ పారడాక్స్ గురించి వివరించడానికి ట్రై చేసింది. ఇది విశ్వంలో మరెక్కడా మనం ఎటువంటి సంకేతాలు లేదా అధునాతన నాగరికతలకు సంబంధించిన ఆధారాలను ఎందుకు గుర్తించలేదనే ప్రశ్నకు సంబంధించింది.
ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ (ASI) అభివృద్ధి, నాగరికత పెరుగుదలలో కీలకమైన దశగా పరిగణించబడుతుంది. ఉదాహరణకు ఒక గ్రహానికి పరిమితం కావడం నుంచి ఇతర గ్రహాలపై మనుగడ సాగించడం కావచ్చు. ఇతర గ్రహాలపై మనుగడ సాధ్యమా? కాదా? అనే అంశాలను ఏఎస్ఐ కనుక్కోగలదు. కానీ గ్రహాంతర నాగరికతల రహస్యాల గుట్టును ఈ టెక్నాలజీ విప్పలేదు. అందుకే ఏలియన్స్ మనుగడను పరిశోధకులు ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ ద్వారా కపిపెట్టలేకపోతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండిపెండెంట్, సెల్ఫ్ ఇంప్రూవింగ్ లక్షణాలు, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్, గణనీయమైన నష్టాలను కలిగి ఉంటాయి. దేశాలు సైనిక అవసరాలకు అటానమస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్‌లను అమలు చేస్తే, విధ్వంసక సామర్థ్యాల పెరుగుదల ఏఐ వ్యవస్థలతో సహా నాగరికత పతనానికి దారి తీస్తుంది. ప్రస్తుత టెక్నాలజీ తో ఇతర గ్రహాలపై కూడా జీవనాన్ని సాధ్యం చేయాలనే మానవుల అన్వేషణ మళ్లీ ఆసక్తిని రేకెత్తించింది. అయినప్పటికీ సైనిక రక్షణలో ఏఐ పాత్ర గురించి ఆందోళనలు ఉన్నాయి.