Ministers oath Taking : ఏపీలో ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు..

Ministers oath Taking
Ministers Oath Taking : ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఎన్నికల్లో 164 స్థానాలతో ప్రభంజనం సృష్టించిన టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి విజయభేరి మోగించింది. ఈరోజు చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం.. ఆయన మంత్రివర్గ సహచరులు 24 మంది ప్రమాణం చేశారు.
టీడీపీ నుంచి నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, పొంగూరి నారాయణ, వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, ఫరూక్, ఆనం రామనారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, డోలా బాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, ఎస్.సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.
జనసేన నుంచి పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్ ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు.
కాగా, ఈ క్యాబినెట్ లో 17 మంది కొత్తవారే ఉన్నారు. అందులో ముగ్గురు మహిళలు. 8 మంది బీసీలు, ఇద్దరు ఎస్సీలు, ఒక ఎస్టీ, ఒక వైశ్య సామాజికవర్గ నేతకు క్యాబినెట్ లో అవకాశం కల్పించారు.