Akkineni Nagarjuna : మంత్రి వ్యాఖ్యలు అనుచితం.. కోర్టుకు హాజరైన అక్కినేని నాగార్జున

Akkineni Nagarjuna
Akkineni Nagarjuna : సినీ నటుడు నాగార్జున నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల గురించి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. నాగార్జునతో పాటు సాక్షులు సుప్రియ, వెంకటేశ్వర్లు సైతం కోర్టుకు హాజరయ్యారు. మంత్రి కొండా సురేఖ వాస్తవ విరుద్ధమైన వ్యాఖ్యలు చేశారని, దీంతో తమ కుటుంబ పరువు ప్రతిష్ఠలకు భంగం వాటిల్లిందని ఆ పిటిషన్ లో నాగార్జున పేర్కొన్నారు. ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ పిటిషన్ లో కోరారు.
తాజాగా.. కోర్టుకు ఇచ్చిన స్టేట్ మెంట్ లో ‘‘మంత్రి కొండా సురేఖ తమ కుటుంబంపై అమర్యాద పూర్వక వ్యాఖ్యలు చేశారు. మా కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. మా కుటుంబ పరువు, మర్యాదలకు భంగం వాటిల్లింది. మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి’’ అని నాగార్జున కోర్టుకు ఇచ్చిన స్టేట్ మెంట్ లో పేర్కొన్నారు. కాగా, కోర్టుకు నాగార్జునతో పాటు ఆయన భార్య అమల, కుమారుడు నాగచైతన్య కూడా వచ్చారు.