JAISW News Telugu

Chief Minister PS : ముఖ్యమంత్రి పీఎస్ పై మంత్రులు, ఎమ్మెల్యేలు ఫైర్.. కారణం ఇదేనా?

Chief Minister PS

Chief Minister PS

Chief Minister PS : ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడి  వ్యక్తి గత కార్యదర్శి విషయంలో చిక్కులు వచ్చి పడుతున్నాయి. సీఎం పర్సనల్ సెక్రటరీ అయిన కాపర్తిపై మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీఎంతో తమకు అందుబాటులో ఉండేందుకు పర్సనల్ సెక్రటరీ అడ్డుపడుతున్నారని, ముఖ్యమైన విషయాలను ఆయన దృష్టికి తీసుకువచ్చిన తర్వాతనే ఆయన బాబుకు చేరవేస్తున్నాడని దీంతో కొన్ని పనులు విఫలమవుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఇది ముఖ్యమంత్రి ప్రతిష్టను దెబ్బతీస్తుందని వారు భావిస్తున్నారు.

టీడీపీ జాతీయ ప్రతినిధి జీవీ రెడ్డి ఆ పార్టీ మీడియా ఛానెల్ లో కాపర్తిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన పిలుపునకు స్పందించడం లేదని, కాపర్తి ఈ పదవిలో కొనసాగితే అది ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్టకు భంగం కలిగిస్తుందని జీవీ రెడ్డి మండిపడ్డారు. ఈ విషయమై కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు కపర్తిని సంప్రదిస్తే అహంకారపూరితంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించినట్లు సమాచారం. కాపర్తిని పక్కన పెట్టారని, కనీస మర్యాద కూడా లేదని మంత్రులు ఆరోపించారు.

చంద్రబాబు నాయకత్వంలో పని చేసేందుకు ఎన్నో ఆశలు పెట్టుకున్నామని, కానీ ప్రస్తుత పరిస్థితులతో నిరుత్సాహానికి గురయ్యామని మంత్రులు, ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి రాజకీయ పరిణామాలను తాము ఊహించలేదని వారు పేర్కొంటున్నారు. కాపర్తి ప్రవర్తనపై టీడీపీలో విస్తృతంగా చర్చ జరుగుతున్నా.. ఆయన మాత్రం ఎవరినీ పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.

అయితే ప్రజాప్రతినిధుల సంఖ్య తక్కువగా ఉంటే ఏ ఒక్క కార్యదర్శి అయినా చంద్రబాబు నాయుడితో సమావేశాలు నిర్వహిస్తారని కొందరు టీడీపీ నేతలు వాదిస్తున్నారు. ఇప్పుడు పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు ఉండడంతో కాపర్తి అందరినీ సర్దుబాటు చేయడం కష్టంగా మారిందని వారు అంటున్నారు. ప్రస్తుతం కాపర్తి తీరుపై టీడీపీలో అసంతృప్తి ఉందని తెలుస్తోంది.

Exit mobile version