Minister upset : ట్రాన్స్ ఫర్ చేసినందుకు అలిగిన మంత్రి
Minister upset : మంత్రి దామోదర రాజనర్సింహ తన శాఖలో ఇద్దరు ఐఏఎస్ అధికారులను తనకు కనీస సమాచారం ఇవ్వకుండా బదిలీ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా, బదిలీల జాబితాలో లేకపోయినా చివరి నిమిషంలో ఒక అధికారిని బదిలీ చేయడం, తాను వద్దని కోరిన అధికారిని కూడా బదిలీ చేయడంపై ఆయన అసంతృప్తిగా ఉన్నారు. దీంతో అలిగిన మంత్రి సోమవారం తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుని, లోకాయుక్త ప్రమాణ స్వీకారానికి కూడా హాజరు కాలేదు. రోజంతా ముభావంగా ఉంటూ ఎవరినీ కలవలేదని సమాచారం.