Minister Roja : ఎల్లో మీడియాగా అభివర్ణిస్తూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి ఇప్పటి జగన్మోహన్ రెడ్డి వరకు ఈనాడు గ్రూపులను కనుమరుగు చేద్దాం అనుకున్నారనేది ఓపెన్ సీక్రెట్. ఈనాడు మూలాలను దెబ్బతీసే దిశగా జగన్ అడుగులు వేస్తుంటే.. ఆయన పార్టీ నాయకులు, మంత్రుల వరకు అదే గ్రూపునకు చెందిన ‘మార్గదర్శి’ చిట్స్ లో చీటీలు కడుతున్నారు.
ఈనాడు గ్రూప్ ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు రామోజీరావు ‘మార్గదర్శి’ని ముందు టార్గెట్ చేయాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతటి ఎత్తుగడ వేసినా మార్గదర్శి చందాదారులల నమ్మకాన్ని జగన్ వమ్ము చేయలేకపోయారనేది మరో కథ.
సొంత నేతలను కూడా జగన్ అడ్డుకోలేకపోయారని తెలుస్తోంది. మొన్న మంత్రి, నగరి ఎమ్మెల్యే రోజా నగరి అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. మార్గదర్శి వద్ద రూ.39.21 లక్షల విలువైన చిట్ ఉందని రోజా తన అఫిడవిట్ లో వెల్లడించారు. కేసులు, ఆరోపణలతో మార్గదర్శి సబ్ స్క్రైబర్లు భయాందోళనకు గురవుతున్న విషయాన్ని మర్చిపోయి రోజా కూడా పట్టించుకోవడం లేదు.
జగన్ మోహన్ రెడ్డి కంటే రామోజీరావునే తాను నమ్ముతానని రోజా నిరూపించుకున్నారు. 10.69 కోట్ల ఆస్తులు ఉన్నట్లు రోజా ప్రకటించారు. 2019తో పోలిస్తే ఆస్తులు రూ.81 లక్షలు పెరిగాయి. ప్రస్తుతం ఆమె వద్ద 9 కార్లు ఉండగా, 2019లో ఆరు కార్లు, ఒక బైక్ ఉన్నాయి. ఈ ఐదేళ్లలో రోజా తన భర్త పేరిట 6.39 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఆమెకు మరో కంపెనీలో రూ.32.9 లక్షల విలువైన చిట్ ఉంది.
2019లో తనపై నాలుగు కేసులు ఉన్నాయని రోజా పేర్కొన్నారు. అయితే తాజా అఫిడవిట్ లో ఆమెపై ఎలాంటి కేసులు లేవని పేర్కొన్నారు.