Roja:వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి ఆర్కె. రోజాకు సీటు దక్కదా? ఆ కారణంగానే రోజా స్టేట్మెంట్లు ఇస్తోందా? అంటే అవునని కొంత మంది చెబుతుంటే ఆర్కె రోజా మాత్రం భిన్నంగా స్పందిస్తోంది. మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా నగరి టికెట్‌పై జరుగుతున్న ప్రచారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని సెటైర్లు వేశారు.
ప్రభుత్వ కార్యక్రమాలు ఏవి జరిగినా ముందుండేది నేనే. నేను సీఎం జగనన్నకు సైనికురాలిని. జగనన్న కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధం. సీటు ఇవ్వకపోయినా జగనన్న వెంటే ఉంటా. మిషన్ 2024లో 175/175లో భాగం అవుతా` అన్నారు. ఎన్నికల్లో పోటీచేసే అంశంపై స్పందించారామె. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆమె స్పష్టం చేశారు. నగరిలో రోజాకు సీటు లేదంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ నించుంటాడా? లేక చంద్రబాబు నించుంటాడా? లేదా రామోజీ నించుంటాడా?అంటూ చురకలింటించారు.
నగరి నుంచి టికెట్ ఎవరికి ఇచ్చినా నాకు ఇబ్బంది లేదు. నేనైతే జగనన్న సైనికురాలిని. జగనన్న కోసం నా ప్రాణమైనా ఇస్తాను. ఈ మాట అనేక సందర్భాల్లో చెప్పాను. ఇది రాసిపెట్టుకోండి. మా కార్యకర్తలతో, నాయకులకో ఎవరికీ బాధలేదు. నాకు సీటు ఉందని వాళ్లుకు నిజం తెలుసు. ఇక వేళ నాకు సీటు లేదని ఎవరైనా ఆనందపడినా నాకు ఇబ్బంది లేదు.