Amaravati : జైస్వరాజ్య వరుస కథనాలకు స్పందించిన మంత్రి నారాయణ
మీడియాలో జైస్వరాజ్య టీవీ కొత్త సంచలనాలకు వేదిక అవుతోంది. సరికొత్త దుమ్మురేపే కథనాలతో ప్రజలకు చేరువ అవుతోంది. పాలకుల దృష్టికి తీసుకెళ్లి వారిద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి వారధి అవుతోంది.
తాజాగా ఏపీ పురపాలక మంత్రి నారాయణ సైతం జైస్వరాజ్య టీవీ కథనాలపై స్పందించారు. ఇటీవల అమరావతిలో వైసీపీ ప్రభుత్వంలో ఆగిపోయిన మంత్రుల భవనాలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జడ్జీ ల క్వార్టర్స్ గురించి జైస్వరాజ్య టీవీ వరుస కథనాలు చేసిన సంగతి తెలిసిందే. ఇవీ సంచలనమయ్యాయి. ఏపీలో కొత్తగా కొలువుదీరిన టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వానికి చేరాయి. దీనిపై స్పందించిన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఈ మేరకు అమరావతిలో పెండింగ్ పనులను పూర్తి చేస్తానని జైస్వరాజ్య టీవీ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు.
అమరావతి పెండింగ్ పనులకు త్వరలోనే పరిష్కారం చూపుతామని.. ఉన్నవారికే ఇచ్చి పనులన్నీ పూర్తి చేస్తామని జైస్వరాజ్య టీవీకి మంత్రి నారాయణ తెలియజేశారు.
అమరావతిని దేశంలోనే నంబర్ 1 రాజధానిగా తీర్చిదిద్దుతామని.. అన్నా క్యాంటీన్లను కూడా వేగంగా ప్రారంభిస్తామని.. మరో మూడు రోజుల్లోనే అధికారులతో మాట్లాడి పెండింగ్ పనులను పూర్తి చేసి ప్రారంభిస్తామని మంత్రి నారాయణ ఈ సందర్భంగా జై స్వరాజ్య టీవీ ఇంటర్వ్యూలో తెలియజేశారు.