Minister Nara Lokesh : సౌదీ అరేబియాలో చిక్కుకున్న వ్యక్తికి మంత్రి లోకేశ్ భరోసా
Minister Nara Lokesh : సౌదీ అరేబియాలో చిక్కుకున్న మరో వ్యక్తి తన దీన స్థితిని వీడియోల వివరిస్తూ ట్విట్టర్ ద్వారా పోస్టు చేశాడు. దీనిపై మంత్రి లోకేశ్ బాధితునిక భరోసా ఇచ్చారు. ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన ఎంతోమంది ఏజెంట్ల చేతుల్లో మోసపోయి అక్కడ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా, సరెల్ల వీరేంద్రకుమార్ అనే తెలుగు వ్యక్తి వీడియో ద్వారా తన దీన స్థితిని వివరించాడు. ఖతర్ లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి సౌదీ అరేబియా తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ నెల 10న ఖతర్ వెళ్లానని అక్కడి నుంచి 11వ తేదీన సౌదీ అరేబియా తీసుకెళ్లి ఒంటెలు ఉన్న ఎడారిలో పడేశారని, ఇక్కడ దుర్భర జీవితం గడుపుతున్నట్లు వాపోయాడు. తనకు రక్త వాంతులు అవుతున్నాయని.. చనిపోయేలా ఉన్నానంటూ చెప్పాడు. తనను కాపాడాలని వేడుకున్నాడు. ఈ వీడియోను ట్విట్టర్ (x)లో పోస్టు చేశాడు.
ఈ వీడియో చూసిన మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ బాధితునికి భరోసా ఇచ్చారు. ధైర్యంగా ఉండాలని, స్వస్థలానికి తీసుకొచ్చే బాధ్యత తనదని హామీ ఇచ్చారు.