Legal notices : మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపిస్తా.. ఊరుకునేదే లేదు : నాగార్జున
Legal notices : బీఆర్ఎస్ సోషల్ మీడియా, రాష్ట్ర మంత్రి కొండా సురేఖకు మధ్య జరిగిన రాజకీయ వార్ కాస్త అక్కినేని నాగార్జున ఫ్యామిలీ కొండా సురేఖ మధ్యకు షిఫ్ట్ అయిపోయింది. అక్కినేని నాగచైతన్య సమంతల విడాకులకు కారణం కేటీఆర్ అని సమంతను పర్సనల్ లైఫ్ లో కేటీఆర్ ఇబ్బంది పెట్టాడని అంతేకాకుండా నాగార్జున కూడా ఇబ్బంది పెట్టాడని చెప్పరాని విధంగా కొండా సురేఖ వ్యాఖ్యానిం చారు.
దీంతో నాగార్జున సైతం స్పందించారు. కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు ఏమాత్రం ఉపేక్షించేవి కావని వీటిని తీవ్రంగా ఖండిస్తున్నానని ఇప్పటికే ప్రకటించారు. కాగా తాను వైజాగ్ లో ఉన్నానని హైదరాబాద్ వచ్చిన తర్వాత మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపిస్తానని ప్రకటించారు. ఈ విషయంలో ఏమాత్రం ఊరుకునేది లేదని కొండా సురేఖ లాంటి మహిళ ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఈ విధంగా ప్రవర్తించడం సరైనది కాదని అన్నారు. ఇప్పటికే ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో కాంగ్రెస్ ప్రభుత్వం పై రేవంత్ రెడ్డి పై ఆగ్రహంగా ఉన్న నాగార్జున ఎప్పుడు సమయం వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.
కాగా సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నాయకులు కొండా సురేఖ పై అనుచితంగా వ్యాఖ్యలు చేయడం ఎంపీ రఘునందన్ రావు కొండా సురేఖకు అక్రమ సంబంధాన్ని అంటగడుతూ చేసిన వ్యాఖ్యలతో కొండా సురేఖ కంటతడి పెట్టిన విషయం తెలిసిందే. దీనిపై మాజీ మంత్రి హరీష్ రావు కూడా స్పందించారు. కొండా సురేఖకు జరిగిన అవమానాన్ని తాను ఖండిస్తున్నానని కూడా చెప్పారు. కాగా సోషల్ మీడియాలో బీఆర్ఎస్ కు సంబంధించిన వారితో కేటీఆర్ ఇది చేయించాడని కొండా సురేఖ ఆరోపించారు.
అంతేకాకుండా కొండా సురేఖ నాగార్జున ఫ్యామిలీ పై తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో నాగార్జున తాజాగా స్పందించారు. మంత్రి కొండా సురేఖకు కచ్చితంగా లీగల్ నోటీసులు పంపిస్తారని ఈ విషయంలో ఊరుకునేది లేదని హెచ్చరించారు. హైదరాబాద్ రాగానే తాను ముందు చేయబోయే పని ఇదేనని చెప్పారు. కాగా మంత్రి కొండా సురేఖ దీనిపై ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. సమంతపై అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సింది అని కొండా సురేఖ ఇప్పటికే విచారం వ్యక్తం చేశారు. అయినా ఈ విషయంలో విడిచిపెట్టే ప్రసక్తే లేదని నాగర్జున వెల్లడించడం అటు కేటీఆర్ కూడా పరువు నష్టం దావా వేస్తానని చెప్పడంతో ఈ వివాదం ముదిరి పాకాన పడుతోంది.