YCP Manifesto : వైసీపీ మ్యానిఫెస్టోపై చంద్రబాబు మైండ్ బ్లోయింగ్ రియాక్షన్

YCP Manifesto

YCP Manifesto Chandrababu Reaction

YCP Manifesto : ఏపీలో ఎన్నికల పోలింగ్ మరో 16 రోజులే మిగిలి ఉంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అధినేతలు ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు. ఓ ఎండలు మండుతున్నా ప్రజల ఆశీర్వాదం కోంస చెమటోడుస్తున్నారు. ఇక టీడీపీ కూటమి మేనిఫెస్టోను రిలీజ్ చేయగా..  వైసీపీ అధినేత జగన్ తమ పార్టీ మ్యానిఫెస్టోను ఇవాళ విడుదల చేశారు. దీనిపై జనాలు, నాయకుల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.

వైసీపీ నేతలు మ్యానిఫెస్టో అద్భుతం, అపురూపం అని చెబుతుంటే.. విపక్షాలు మాత్రం పెదవి విరుస్తున్నాయి. ఈక్రమంలో ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు వైసీపీ మ్యానిఫెస్టో పై స్పందించారు. ఈమేరకు ఆయన ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టారు.

జగన్ ఏపీ ప్రజలకు ఇచ్చిన 730 హామీల్లో ఇవి కొన్ని అంటూ ఆయన ఓ వీడియోను కూడా దీనికి జత చేశారు. ఇందులో జగన్ గతంలో ప్రకటించిన 2019 ఎన్నికల మ్యానిఫెస్టో హామీలు ఉన్నాయి. వీటిని ప్రస్తావిస్తూ గట్టిగా అరిచి మరీ చెప్పిన ఈ హామీల్లో ఒక్కటి కూడా జగన్ నెరవేర్చలేదని చంద్రబాబు విమర్శించారు. ఆ మాటకొస్తే 85 శాతం హామీలను జగన్ నెరవేర్చలేదన్నారు. ఈ రోజు మళ్లీ ఇంకో మ్యానిఫెస్టోతో జనాలను మోసం చేయడానికి వచ్చాడన్నారు.

మళ్లీ ఇంకోసారి మోసపోవడానికి మీరు సిద్ధమా అని జగన్ అడుగుతున్నాడని.. నిన్ను ఇంటికి పంపడానికి సిద్ధం అని మీరు కూడా గట్టిగా చెప్పండని చంద్రబాబు ప్రజలకు సూచించారు. వైసీపీ 2019లో విడుదల చేసిన మ్యానిఫెస్టోలో హామీలను 99 శాతం నెరవేర్చామని ఇవాళ సీఎం జగన్ తెలిపారు.

ఇప్పటికే వైసీపీ నేతలు కూడా ఇదే అంశాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్తున్నారు. ఇలాంటి సమయంలో జగన్ నెరవేర్చని హామీలపై చంద్రబాబు వీడియో విడుదల చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాబోయే రోజుల్లో ప్రధాన పార్టీల మధ్య మ్యానిఫెస్టో అంశాలపై మాటల యుద్ధం జరుగనుంది. మరి జనం ఎవరి మ్యానిఫెస్టోను నమ్ముతారు అనేది ఎన్నికల ఫలితాల రోజు తెలియనుంది.

TAGS