Ashoduddin Owaisi : తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూలో కల్తీపై వివాదం పెరుగుతోంది. దీనిపై మత పెద్దల నుంచి రాజకీయ పార్టీల నేతల వరకు ప్రకటనలు వెలువడుతున్నాయి. కాగా.. ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ బుధవారం (సెప్టెంబర్ 25) తొలిసారిగా ఈ వివాదంపై స్పందించారు. ముంబైలో విలేకరుల సమావేశంలో ఒవైసీ మాట్లాడుతూ.. తిరుపతిలోని ప్రసాదంలో జంతువుల కొవ్వు వినియోగించినట్లు సమాచారం. ఇలా జరిగితే తప్పే. మేము కూడా దీన్ని తప్పుగా భావిస్తున్నాం ఇలా జరగద్దు అన్నారు. ఆ తర్వాత వక్ఫ్ బిల్లు గురించి మాట్లాడారు. ఇది ముమ్మాటికి వక్ఫ్ బోర్డును నిర్వీర్యం చేసే కుట్రనే అన్నారు. ముస్లిం సమాజానికి చెందిన వాడు కాకుండా బయటి వారు వక్ఫ్ బోర్డులో ఎలా ఉంటారని ఆయన ప్రశ్నించారు. బోర్డు ఆస్తులన్నీ ప్రైవేట్ కు చెందినవని, కానీ బీజేపీ ప్రభుత్వానివని దుష్ప్రచారం చేస్తోందన్నారు. హిందూ మతంలో ఆస్తిని దానం చేసినట్లే వక్ఫ్‌లో కూడా భూమి దానం చేస్తారు. హిందూ మతంలో కూడా ఎవరికైనా వక్ఫ్ కు విరాళం ఇవ్వవచ్చని ఒవైసీ అన్నారు, మరి అలా ఎందుకు?