JAISW News Telugu

Bryan Johnson : వయస్సును వెనక్కి పిలుస్తున్న మిలియనీర్..యువకుడిలా మారాలని కోట్ల రూపాయల ఖర్చు..

Bryan Johnson

Bryan Johnson

Bryan Johnson : ఒక్కొక్కరికి ఒక్కో పిచ్చి ఉంటుంది. కొందరు సృష్టికే ప్రతిసృష్టి చేయాలనుకుంటారు. కాలాన్ని వెనక్కి తేవడం, కాలాన్ని ముందుకు జరుపడం లాంటి ప్రయోగాలు చేస్తుంటారు. ప్రపంచంలో వివిధ అంశాలపై ప్రయోగాలను చేస్తునే ఉంటారు. వీటి కోసం కోట్ల రూపాయలు వెచ్చిస్తునే ఉంటారు. పాశ్చాత్య దేశాల్లో ఇలాంటి ప్రయోగాలు జరుగుతుంటాయి. తాజాగా ఓ సంపన్న వ్యక్తి తన వయస్సును తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నారు. అతడు ఎవరో..అతడి కథ ఏంటే ఒకసారి చూద్దాం..

ప్రముఖ వ్యాపారవేత్త బ్రయాన్ జాన్సన్ తన వయస్సును తగ్గించుకునేందుకు తీవ్రంగా కష్టపడుతున్న విషయం తెలిసిందే. దీనికి ‘ప్రాజెక్ట్ బ్లూప్రింట్’ అని పేరు కూడా పెట్టారు. ప్రత్యేకమైన ఆహారం, 100 కంటే ఎక్కువ రోజువారీ సప్లిమెంట్లతో కూడిన కఠినమైన నియమావళిని ఆయన ఆచరిస్తున్నారు. దీనికి అతడు దాదాపు సంవత్సరానికి రూ.16 కోట్లకు పైగా ఖర్చు పెడుతున్నారు. 46 ఏండ్ల వయస్సు కలిగిన బ్రయాన్ తన వయస్సును 5.1 సంవత్సరాలను తగ్గించుకున్నట్లు ప్రకటించగా, తాజాగా తన వయసు తగ్గింపులో భాగంగా తన ముఖ ఆకృతి ఎలా మారిందో ప్రజలకు తెలియజేయడానికి 2018,2023,2024 సంవత్సరాల్లో తను ఎలా ఉండేవారో ఆయా ఫొటోలను షేర్ చేశారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఆయన షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

ఎక్స్ లో బ్రయాన్ జాన్సన్ ..‘‘నా ఫేస్ ఐడీ కూడా గందరగోళంగా ఉంది. నేను పరివర్తన చెందుతున్నాను..’’ అని రాశారు. అయితే ఈ ఫొటోల పట్ల యూజర్లు పలు కామెంట్లు చేస్తున్నారు. కొంత మంది ఆయన రూపాన్ని చూసి నవ్వుతుండగా, మరికొందరు యాంటీ ఏజింగ్ పట్ల అతడి అంకిత భావాన్ని ప్రశంసించారు. మరొక వినియోగదారు జుట్టు రంగులో చాలా మార్పులు వచ్చాయి. అది జరగాలంటే మీ శరీరం తప్పనిసరిగా వాటికి అవసరమైన పోషకాలు పొందాల్సి ఉంటుంది. దీనికి మీరు చాలా కష్టపడ్డారని తెలుస్తుందని ఎక్స్ లో కామెంట్ చేశారు. వృద్ధాప్యాన్ని తగ్గించడానికి జాన్సన్ ప్రాజెక్ట్ బ్లూప్రింట్ లో భారీగా పెట్టుబడి పెట్టాడు. ఇందులో ప్రత్యేక ఆహారం, వైద్య పర్యవేక్షణ, చికిత్సలు, వ్యాయామం ఉన్నాయి.

Exit mobile version