Microsoft : మైక్రో సాఫ్ట్ అతి పెద్ద డేటా సెంటర్ హైదరాబాద్ లో ?

Microsoft

Microsoft Data Centre

Microsoft : ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ హైదరాబాద్ లో తన వ్యాపారాన్ని విస్తృత పరచడానికి 40 కోట్ల రూపాయలతో స్థలాన్ని కొనుగోలు చేసింది. రంగారెడ్డి జిల్లాలో 40 కోట్లతో 17 ఎకరాల స్థలాన్ని మైక్రోసాప్ట్ సంస్థ కొనుగోలు చేసింది. ఇప్పటికే మైక్రో సాఫ్ట్ సంస్థకు చెందిన ఆఫీసులో హైదరాబాద్, బెంగళూరు, ముంబయి, ఫుణే, చెన్నై లలో ఉండగా.. హైదరాబాద్ లో  అతి పెద్ద డేటా సెంటర్ ను ప్రారంభించడానికి మైక్రో సాఫ్ట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

రంగారెడ్డి జిల్లా ఫారూఖ్ నగర్ మండలం ఎలికట్ట గ్రామంలో మైక్రోసాఫ్ట్ ఈ భూమిని కొనుగోలు చేయగా.. ఇక్కడ మైక్రో సాఫ్ట్ ప్రారంభం అయితే ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు  లభించనున్నాయి.  ఇక్కడ అతి పెద్ద డేటా సెంటర్ ను ప్రారంభించడానికి భూమి కొన్నట్లు ఎలాంటి ఆధారాలు లేకున్నా.. చాలా మంది ఇప్పటికే ఎక్కువ స్థలం కొనడానికి గల కారణం ఏమై ఉంటుందని ఆలోచనలో పడ్డారు. 

మైక్రో సాఫ్ట్ వివిధ రకాల పనులకు అవసరం పడుతుంది. క్లయింట్ సాఫ్ట్ వేర్, సర్వర్ సాఫ్ట్ వేర్ ల కలయిక. అమెరికాలోని లాస్ వెగాస్ లో మొదటి సారి బిల్ గేట్స్ 1988 ఆగస్టు 1న దీన్ని ప్రకటించారు.  మొదట్లో ఇది మైక్రో వర్డ్, ఎక్సెల్ షీట్లను కలిగి ఉండేది. సిస్టమ్ లలో విండోస్, మాక్రో ఆపరేటింగ్ సిస్టమ్ లను పరిచయం చేసింది. ఫోన్లలో ఐఓఎస్ సిస్టమ్ ద్వారా మొబైల్ యాప్ లను కూడా నిర్వహిస్తోంది. 

మైక్రో సాప్ట్ స్ప్రెడ్ షీట్, వర్డ్ ప్రాసెసర్ ప్రొగ్రాం, సబ్ స్క్రిప్షన్, తదితర ప్రొగ్రాంలను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ డేటాను సంరక్షిస్తుంది. ఈ మైక్రో సాఫ్ట్ లో మైబైల్ సేవలు, వెబ్ సేవలు, సర్వర్ అప్లికేషన్లు ఇలా ఎన్నో రకాల సేవలను అందిస్తుంది. మరి ఈ మైక్రో సాఫ్ట్ సంస్థ హైదరాబాద్ లో గనక డేటా సెంటర్ పెడితే దీన్ని చూసి మరిన్ని కంపెనీలు కూడా ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది.

TAGS