JAISW News Telugu

Delhi : ఢిల్లీకి వాతావరణశాఖ హెచ్చరికలు.. రాజధానిలో వాటిపై మళ్లీ నిషేధం

Delhi

Delhi Firecrackers

Delhi : ఢిల్లీలో పటాకులపై ఈ ఏడాది కూడా నిషేధం కొనసాగుతుంది. ఢిల్లీలోని కాలుష్య నియంత్రణ కమిటీ ఎన్‌సీఆర్‌లో అన్ని రకాల బాణాసంచా తయారీ, నిల్వ, అమ్మకం, ఆన్‌లైన్ విక్రయాలతో పాటు అన్ని రకాల పటాకుల వాడకంపై పూర్తి నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు జనవరి 1, 2025 వరకు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది. వాతావరణ కాలుష్యం దృష్ట్యా దీపావళి రోజున పటాకుల అమ్మకాలు, వినియోగంపై నిషేధం విధిస్తున్నట్లు ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ గతంలో ప్రకటించారు.

ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యం  
ఢిల్లీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో  కాలుష్యం పెరిగిపోతున్నట్లు  పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నివేదికలు సూచించారు. దసరా రోజునే కాలుష్యం గణనీయంగా పెరిగింది. ఢిల్లీ సగటు వాయు నాణ్యత సూచిక (ఏక్యూఐ) శనివారం 155 కాగా, ఆదివారం 224 దాటింది. ఈ స్థాయి గాలి కాలుష్యంతో ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లనుంది.

కాలుష్యాన్ని అరికట్టేందుకు 21 పాయింట్ల కార్యక్రమం
ఢిల్లీలో కాలుష్యాన్ని అరికట్టడానికి, ఢిల్లీ ప్రభుత్వం ఈ సంవత్సరం 21 పాయింట్ల కార్యక్రమాన్ని సిద్ధం చేసింది. పటాకులను నిషేధించడంతో పాటు సరి-బేసి విధానాన్ని అమలు చేయనుంది.  కృత్రిమ వర్షం కురిపించేందుకు ప్రణాళిక రూపొందించారు. నిషేధాన్ని కఠినంగా అమలు చేసేందుకు ఢిల్లీ పోలీసులు, డీపీసీసీ, రెవెన్యూ శాఖలతో కలిసి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తామని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ ఇటీవల వెల్లడించారు.

వాస్తవానికి, అక్టోబర్ నుంచి ఢిల్లీ గాలి కాలషత్యం పెరిగిపోతున్నది. దీనికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి. ఈ కాలంలో, ఉష్ణోగ్రత పడిపోవడం గాలి వేగాన్ని ప్రభావితం చేస్తుంది. అలాగే ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న హర్యానా, పంజాబ్‌లలో చెత్తను కాల్చడం ద్వారా కాలుష్య స్థాయి పెరుగుతుంది.

Exit mobile version