Men Population : భవిష్యత్తులో పురుష జనాభా అంతరించిపోతుందని షాకింగ్ న్యూస్ పరిశోధకులు తెలిపారు. మగవారు తమ వై-క్రోమోజోములను నెమ్మెదిగా కోల్పోతున్నారని వారు పేర్కొన్నారు. తల్లి కడుపులోని బిడ్డ లింగాన్ని నిర్ధారించడంలో పురుషుల శుక్రకణాల్లోని వై-క్రోమోజోమ్స్ కీలక పాత్ర పోషిస్తాయన్న విషయం తెలిసిందే. అయితే, గత కొంతకాలంగా వై-క్రోమోజోమ్స్ సంఖ్య అంతకంతకూ తగ్గిపోతున్నదని, రానున్న కాలంలో ఇవి కనుమరుగైనా ఆశ్చర్యపోనవసరం లేదని జపాన్ లోని హొక్కయిడో యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు.
తాజాగా ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో రుజువైనట్లు వారు తెలిపారు. అయితే, వైద్యశాస్త్రంలో అమల్లోకి వచ్చిన వినూత్న పద్ధతులు, ఆవిష్కరణల ద్వారా కొత్త జన్యువుల సృష్టితో ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడం అంత పెద్ద కష్టమేమీ కాదని వాళ్లు ఆశాభావం వ్యక్తం చేశారు.