Shirish Bharadwaj : మెగాస్టార్ మాజీ అల్లుడు మృతి.. శ్రీరెడ్డి పోస్ట్ వైరల్..

Megastar Ex-son in Law Shirish Bharadwaj
Shirish Bharadwaj : మెగాస్టార్ చిరంజీవి మాజీ అల్లుడు, చిన్న కూతురు మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ మరణించారు. ఈ విషయాన్ని శ్రీరెడ్డి ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. శిరీష్ గత కొంతకాలంగా లంగ్స్ డ్యామేజ్ తో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
‘శిరీష్ భరద్వాజ్ (చిరంజీవి మాజీ అల్లుడు) ఇక లేరు. ఇప్పటికైనా నీకు శాంతి దొరికింది శిరీష్ భరద్వాజ్. అందరూ నిన్ను మోసం చేశారు.’ అంటూ శ్రీరెడ్డి ఫేస్బుక్లో పోస్ట్ పెట్టింది.
శ్రీజ- శిరీష్ పెళ్లి
కొణిదెల శ్రీజ మొదటి భర్త శిరీష్ భరద్వాజ్. శిరీష్ ను ఆమె 2007లో ప్రేమ వివాహం చేసుకుంది. పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకోవడం సంచలనంగా మారింది. ఇద్దరి మధ్యా మనస్పర్థలు రావడంతో 2014లో వీరు విడిపోయారు. అప్పటికే వీరికి ఒక కూతురు పుట్టింది. శిరీష్ నుంచి విడిపోయిన తర్వాత శ్రీజ ఒక వ్యాపారవేత్త కళ్యాణ్ దేవ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2016లో బెంగళూరులో వైభవంగా వీరి వివాహం జరిగింది. ఈ జంటకు ఒక కుమార్తె పుట్టింది. అయితే వీరు కూడా ఇప్పుడు విడిపోయారు.
Rest in peace sirish pic.twitter.com/nins1IqxNt
— Sri Reddy (@SriReddyTalks) June 19, 2024
శిరీష్ భరద్వాజ్ కూడా 2019లో మరో వివాహం చేసుకున్నారు. ఫ్యామిలీతోనే హ్యాపీగా ఉంటూనే ఇటీవల బీజేపీలో చేరారు. పొలిటికల్ గా కూడా చురుగ్గా ఉన్నారు. అనారోగ్య సమస్యల కారణంగా ఆయన కన్నుమూసినట్లు తెలుస్తోంది. శ్రీరెడ్డి పోస్ట్ పై మెగా ఫ్యాన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. ఎప్పుడో విడిపోయిన వ్యక్తి గురించి ఇప్పుడు మాట్లాడడం సరికాదని కొందరు శ్రీరెడ్డిపై మండిపడుతున్నారు.